ఉప్పెన హీరో హీరోయిన్లకు మైత్రివారి భారీ బహుమతులు!

Update: 2021-02-26 14:30 GMT
ఈ ఏడాది డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటించిన సినిమా ఉప్పెన. ఈ సినిమాతోనే వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలతో పాటు తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పరిచయం అయ్యాడు. ఫిబ్రవరి 12న సినిమా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉప్పెన అదృష్టం ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ సమయానికి థియేటర్లలో వందశాతం సీటింగ్ అనుమతి లభించడం. అలా థియేటర్స్ ఫుల్ క్వాంటిటీతో రన్ చేయొచ్చనే వార్త వచ్చిన వెంటనే ఉప్పెన రిలీజ్ అయింది. ఫస్ట్ డేనే రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ఇంతవరకు ఏ డెబ్యూ హీరోకి ఇలాంటి ఓపెనింగ్ కలెక్షన్స్ రాలేదని టాక్. అలాంటిది మొదటి సినిమాకే వైష్ణవ్ తేజ్ మంచి హిట్ అందుకున్నాడు. తనతో పాటు హీరోయిన్ కృతిశెట్టికి కూడా మంచి నేమ్ ఫేమ్ తో వరుస ఆఫర్స్ దక్కించుకుంటుంది.

అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా.. అనుకున్నదానికంటే డబుల్ కలెక్షన్స్ తీసుకొచ్చిందట. అలాగే వరుస హిట్స్ లో ఉన్నారు మైత్రి నిర్మాతలు. తాజాగా ఈ సినిమా హీరో హీరోయిన్లకు భారీ గిఫ్ట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట నిర్మాతలు. హీరో వైష్ణవ్ తేజ్ కు ఓ కోటి రూపాయలు, అలాగే హీరోయిన్ కృతికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇవి వారి రెమ్యూనరేషన్ కాకుండా అదనంగా ఇస్తున్నారట. ప్రస్తుతం మైత్రి వారి బహుమానం గురించి ఇండస్ట్రీ మొత్తం చర్చలు నడుస్తున్నాయి. అలాగే ఉప్పెనతో మంచి హిట్ సినిమా అందించిన డైరెక్టర్ బుచ్చిబాబుకు ఆల్రెడీ నిర్మాతలు కారు లేదా ఇల్లు ఆఫర్ చేశారట. అంతేగాక బుచ్చిబాబుతో మరో రెండు సినిమాలకు కూడా సంతకం చేయించుకున్నట్లు తెలుస్తుంది. చూస్తుంటే మైత్రి వారు సినిమా హిట్ అయితే ఎలాంటి బహుమానం అయినా ఇచ్చేలా ఉన్నారంటూ సరదా కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News