రౌడీ స్టార్‌ రేంజ్‌ ను బాగా పెంచేస్తున్నారుగా

Update: 2019-05-18 11:03 GMT
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో మొదటిగా 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రం జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో మూవీని కూడా విజయ్‌ దేవరకొండ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే తమిళ దర్శకుడు ఆనంద్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. రేసింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట. ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈనెల 22 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. మొదటి షెడ్యూల్‌ ను ఢిల్లీలో జరుపబోతున్నారు. ఢిల్లీలో రెండు భారీ బైక్‌ రేజింగ్‌ సీన్స్‌ ను చిత్రీకరించబోతున్నారు. అందుకోసం ఏకంగా 8 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఫారిన్‌ బైక్స్‌ తో పాటు, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు మరియు క్రేజ్‌ లను ఇందుకోవడం వాడబోతున్నట్లుగా తెలుస్తోంది.

కేవలం రెండు సీన్స్‌ కే ఆస్థాయిలో ఖర్చు చేస్తున్నారంటే సినిమా బడ్జెట్‌ ఏ రేంజ్‌ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా సినిమాకు తన క్రేజ్‌ ను పెంచుకుంటూ పోతున్న విజయ్‌ దేవరకొండ తన సినిమాల బడ్జెట్‌, పారితోషికంలను కూడా పెంచేస్తున్నాడు. మొత్తాని ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంతో విజయ్‌ దేవరకొండ స్టార్‌ డం మరింతగా పెరగబోతుందనిపిస్తుంది.
Tags:    

Similar News