• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భారీ మార్పులు చేర్పులు...

భారీ మార్పులు చేర్పులు 'వకీల్ సాబ్' కు వర్కౌట్ అయ్యేనా..?

By - Tupaki Desk
Update: 2021-03-30 06:30 GMT
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ''వకీల్‌ సాబ్‌''. ఇది 'పింక్' చిత్రానికి రీమేక్. పవన్‌ రీ ఎంట్రీ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మూడేళ్ళ నిరీక్షణకు తెర దించుతూ ‘వకీల్‌సాబ్‌’ థియేట్రికల్ ట్రైలర్ తో ఫ్యాన్స్ ని అలరించాడు పవన్. సోమవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రీమేక్ అయినప్పటికీ పవన్‌ ఇమేజ్‌ కి తగ్గట్లుగా కథకు కావాల్సినంత కమర్షియల్‌ టచ్‌ ఇచ్చినట్లు ట్రైలర్ తో అర్థమైంది.

అయితే ఇన్నాళ్లు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ వల్ల మహిళల ప్రాధాన్యత తెలియజెప్పే చిత్రాన్ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మార్చేస్తున్నారనే కామెంట్స్ వచ్చాయి. అందుకేనేమో ట్రైలర్ లో 'పింక్' ఛాయలు కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంత కోర్టు డ్రామా అయినా చివరకు ఇది పవన్ సినిమానే అంటారు కాబట్టి 'వకీల్ సాబ్' లో పవన్ కు ఫ్లాష్ బ్యాక్ - జోడీగా హీరోయిన్ ని కూడా పెట్టారు. ఇంతచేసి పవన్ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు.. పాటలు లేకపోతే ఎలా అంటూ వాటిని కూడా జత చేశారు.

లాయర్ గా పవన్‌ కోర్టులో వాదించడం చూపిస్తూనే రౌడీలను దండిస్తూ అతని యాక్షన్‌ హంగామాని ట్రైలర్‌ లో చూపించారు. ఫ్యాన్స్ పవన్ నుంచి ఏమేం ఆశిస్తారో అన్ని కమర్షియల్ హంగులు ఉండేలా భారీ మార్పులు చేర్పులు చేసిన 'వకీల్ సాబ్' ఆడియన్స్ ని ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. 'పింక్' సినిమా చూడని వారికి అభిమానులకు ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆల్రెడీ మాతృక సినిమాని చూసేసిన వారిని ఎలా మెప్పిస్తుందన్నది చూడాలి.

ఇదిలా వుండగా 'వకీల్ సాబ్' ట్రైలర్ వ్యూస్‌ - లైక్స్‌ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే 15 మిలియన్స్‌ వ్యూస్‌ రాగా.. దాదాపు 8 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇరవై నాలుగు గంటల్లోనే మిలియన్‌ లైక్స్‌ వస్తే ఈ రికార్డ్‌ ను అందుకున్న తొలి చిత్రంగా ‘వకీల్‌ సాబ్‌’ నిలుస్తుంది. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ - బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఏప్రిల్‌ 9న 'వకీల్ సాబ్' విడుదల కానుంది.
Tags:    
  • Vakeel Saab 
  • Pawan Kalyan 
  • Tollywood 
  • Happy Womans Day 
  • Dil Raju 
  • Telugu News 
  • Ss Thaman 
  • Dil Raju 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS