రానా ప్రయత్నాలన్నీ వృదా అయినట్లేనా?

Update: 2020-05-04 08:30 GMT
బాహుబలి.. రుద్రమదేవి వంటి భారీ చిత్రాల్లో నటించిన రానా మరో భారీ చిత్రాన్ని గుణశేఖర్‌ రద్శకత్వంలో చేసేందుకు చాలా కాలం క్రితమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో సురేష్‌ బాబు నిర్మాణంలో హాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ భాగస్వామ్యంతో హిరణ్యకశిప చిత్రంను చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. గత ఏడాది అమెరికాలో ఈ చిత్రం విషయమై రానా చర్చలు జరిపాడట. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా అక్కడ జరిగింది.

హాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు కూడా పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి. అంతా బాగుంటే వచ్చే ఏడాది సినిమా పట్టాలెక్కి ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు హాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు రావడం అనుమానమే అంటున్నారు. రాబోయే రెండేళ్ల వరకు పరిస్థితులు కష్టంగా ఉంటాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణంను వాయిదా వేసుకోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

హిరణ్యకశిప చిత్రం కోసం దర్శకుడు గుణశేఖర్‌ కూడా చాలా కష్ట పడుతున్నారు. ఆయన ఈ చిత్రంను ఎట్టి పరిస్థితుల్లో భారీగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో కరోనా కారణంగా వీరి ప్రయత్నాలు వృదా అయినట్లేనా అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రాజెక్ట్‌ ను పక్కకు పెట్టినా పరిస్థితులు సర్దుమనిగిన తర్వాత ఈ సినిమా మళ్లీ మొదలయ్యేనో చూడాలి.
Tags:    

Similar News