కియ‌రా వ‌ర్సెస్ కృతి! `క్రిష్ 4` జాక్ పాట్ ఎవ‌రికి?!

Update: 2020-12-10 08:08 GMT
`వార్` రూపంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. గత సంవత్సరం అత‌డికి అన్నిర‌కాలుగా క‌లిసొచ్చింది. అయితే ఈపాటికే ప్రారంభం అవుతుంది అనుకున్న క్రిష్ 4 కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న అయితే ఏదీ వెలువ‌రించ‌లేక‌పోవ‌డం హృతిక్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

ప్ర‌తిసారీ ఇదిగో వ‌స్తున్నాం అదిగో వ‌స్తున్నాం! అంటున్నా కానీ క్రిష్ ఫ్రాంఛైజీ కొత్త సినిమాపై స‌రైన స‌మాచారం లేదు. WAR బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. కానీ స‌ద‌రు స్టార్ హీరో అప్పటి నుండి ఎటువంటి ప్రకటనలు చేయలేదు. కొత్త‌ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ చేయడం కూడా ప్రారంభించలేదు. తాజా నివేదిక ప్రకారం.. హృతిక్ హాట్ స్టార్ మూవీ కోసం ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడ‌ని తెలిసింది. అది డిజిటల్ రంగంలో త‌న‌కు పెద్ద అరంగేట్రం అవుతుంది. దీంతో పాటే త్వరలో ప్రకటించబోయే చిత్రం క్రిష్ 4 అని కూడా తాజాగా లీకులందాయి.

హృతిక్ డాడీ రాకేశ్ రోషన్ ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌ని ముగించారు. ప్ర‌స్తుతం ఆయ‌న క‌థానాయిక‌ల వేట‌లో ఉన్నారు. క్రిష్ 4 కోసం కియ‌రా లేదా కృతి ఇద్ద‌రినీ సంప్ర‌దించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు న‌టించేందుకు స్కోప్ ఉండ‌గా.. ఆ ఇద్ద‌రికీ ఛాన్సుంటుందా లేక‌పోతే ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేసే వేరొక నాయిక కోసం ప్ర‌య‌త్నిస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం కియ‌రా.. కృతి సనోన్ ఇద్ద‌రూ బిజీ స్టార్లు.

స‌ద‌రు భామ‌ల కాల్షీట్లు లాక్ అయ్యి ఉన్నాయ‌ని తెలుస్తోంది.  కృతి ఐదు చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా కియ‌రా కూడా చెప్పుకోద‌గ్గ సినిమాలు చేస్తోంది. అయితే కియ‌రాకు మాత్రం నిర్మాత రాకేష్ రోష‌న్ ఇటీవ‌ల ట‌చ్ లోకి వె‌ళ్లార‌ట‌.  కియ‌రా ఓకే అయ్యాక కూడా కృతికి ఛాన్సుంటుంది. అయితే త‌న నుంచి స్పంద‌న రావాల్సి ఉందిట‌. మ‌రి క్రేజీ ఫ్రాంఛైజీలో జాక్ పాట్ కొట్టే నాయిక‌లు ఎవ‌రు? అన్న‌ది కాస్త వేచి చూస్తే కానీ తెలీదు. భార‌త‌దేశంలో 2021-22 సీజ‌న్ కి స‌రిప‌డా వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో మోతెక్కిస్తున్న డార్లింగ్ ప్ర‌భాస్ కి ధీటైన ప్లాన్ హృతిక్ చేస్తున్నార‌నే దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. య‌ష్ రాజ్ సంస్థ నుంచి 2021లో భారీ పాన్ ఇండియా సినిమాలు రానున్నాయి.
Tags:    

Similar News