చిరంజీవి గురించి హృతిక్ ఏమన్నాడంటే..

Update: 2017-01-28 06:18 GMT
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కొత్త సినిమా కాబిల్ రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ బలంకు.. తెలుగు రాష్ట్రాల నుంచి మంచి కలెక్షన్సే వస్తున్నాయి. తెలుగు వెర్షన్ కోసం ప్రచార కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్న హృతిక్.. మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పి ఆశ్చర్యపరిచాడు.

'చిరంజీవి గారిని నా లైఫ్ లో చాలా సార్లు కలిసాను. అంత పెద్ద స్టార్ అయినా సరే.. ఆయన వ్యక్తిత్వం.. మంచితనం.. ఆయన ప్రవర్తనతో  పాటు.. ఆయన అందరికీ ప్రేమను పంచే విధానం నన్ను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. అలాంటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఓసారి ఓ పార్టీలో చాలామంది స్టార్లు ఉన్నారు. చిరంజీవిగారు కూడా ఉన్నారు. నిజానికి ఆ పార్టీ ఇచ్చినది నేను. కానీ ఆయన చొరవగా కొంతమంది గెస్టులకు తనే సర్వ్ చేసేశారు కూడా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం' అంటూ మెగాస్టార్ వ్యక్తిత్వాన్ని పొగిడాడు హృతిక్ రోషన్.  

షారూక్ మూవీ రయీస్ తో పోటీగా రిలీజ్ కావడంతో.. కాబిల్ కి వసూళ్లు తక్కువగా ఉన్నా టాక్ మాత్రం సూపర్బ్ గా ఉండడంతో మెల్లగా పుంజుకుంటోంది కాబిల్. తెలుగు వెర్షన్ కి వస్తున్న కలెక్షన్స్ సంతృప్తి కలిగించాయని చెప్పాడు హృతిక్ రోషన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News