మ‌రో `గ్ర‌హం`పై ఈత కొడుతోన్న హృతిక్.

Update: 2018-07-24 14:33 GMT

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ `సూప‌ర్ 30` బ‌యోపిక్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాపుల‌ర్ ఎడ్యుకేష‌న‌ల్ ప్రోగ్రామ్ `సూప‌ర్ 30` సృష్టిక‌ర్త - ప్ర‌ముఖ గ‌ణిత శాస్త్ర‌వేత్త‌ ఆనంద్ కుమార్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తొలిసారిగా హృతిక్ న‌టిస్తోన్న బ‌యోపిక్ ఇదే కావ‌డం విశేషం. ఈ చిత్రం కోసం హృతిక్ డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌నిపించ‌బోతున్నాడు. ఆ షూటింగ్ లో బిజీబిజీగా గ‌డిపిన హృతిక్ కు కొద్ది పాటి విరామం దొర‌క‌డంతో ప్ర‌స్తుతం హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. త‌న పిల్ల‌లు హ్రెనాన్ - హ్రిధాన్ ల‌తో క‌లిసి గ్రీస్ లో చ‌క్క‌ర్లు కొడ‌తున్నాడు. తాజాగా, త‌న పిల్ల‌ల‌తో క‌లిసి స‌ముద్ర‌పు నీటిలో తేలియాడుతోన్న హృతిక్...ఆ వీడియోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశాడు. స‌ముద్ర ఉప‌రితలానికి ఎత్తులో నుంచి తీసిన ఆ వీడియో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

త‌న కుమారులు హృదాన్‌ - హృహాన్‌ లతో కలిసి సముద్రంలో హృతిక్ ఈత కొడుతున్నాడు. అయితే, సముద్రంపైన డ్రోన్ నుంచి ఆ వీడియోను చిత్రీకరించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఆ ముగ్గురూ ఓ గ్రహంపై ఈత కొడుతున్న‌ట్లుగా ఉంది. ఈ వీడియోను హృతిక్ త‌న ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ..‘జస్ట్‌ చిల్లింగ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అంతేకాదు,....ఆ వీడియో డ్రోన్ తో తీసింది కాదని క్లారిటీ ఇచ్చాడు. ఆస‌క్తిక‌రంగా ఉన్న ఆ వీడియోను ఎలా తీశారో మాత్రం హృతిక్‌ చెప్పలేదు. ఇన్‌ స్టాగ్రామ్ లో ఆ వీడియోను పోస్ట్  చేసిన కొద్ది సేప‌టికే 80వేల మంది వీక్షించారు. కాగా, పాపులర్ మ్యాథ‌మెటీషియ‌న్ ఆనంద్ కుమార్ జీవిత చ‌రిత్ర ఆధారంగా `సూప‌ర్ 30` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 మంది ప్ర‌తిభావంతులైన పేద విద్యార్థుల‌కు ఉచితంగా ఐఐటీ-జేఈఈ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్ రాసేందుకు ఆనంద్ ప్ర‌తి ఏటా శిక్ష‌ణనిస్తున్నారు. ఆయ‌న జీవిత చరిత్ర‌ను వికాస్ బెహెల్ తెర‌కెక్కిస్తున్నారు. సాజిద్ న‌దియావాలా నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News