బట్టలు వేసుకుంటానంటే ఒప్పుకోవట్లేదు

Update: 2017-08-01 17:22 GMT
ఎవరన్నా ఒక హీరోయిన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందనుకోండి.. ఏమిటి ఈవిడ భరితెగించింది అంటారు సోసైటీ. కాని ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండానే ఆలియా భట్ నుండి సమంత వరకు.. అందరూ బికినీల్లో బాగానే ఎక్స్ పోజింగ్ చేస్తుంటారు. సర్లేండి ఆ అందాలను అలా ఆస్వాదించడంలో ఉన్న కిక్కే వేరు. అయితే అదే పనిగా మగాళ్ళు కూడా ఇలాగే తమ న్యూడ్ దేహాలతో హడావుడి చేస్తే ఎలా ఉంటుంది?

''నేను ఎప్పుడు నా స్టయిలిస్టును కలసినా కూడా.. సార్ మీరు ఎక్కువగా బట్టలు వేసుకున్నారు అంటారు. అదేంటయ్యా ఏముందని అంటే.. లేదు సార్ మీరు విప్పాల్సిందే అంటారు. నేను మాత్రం ఏమంటాను.. వారు చెప్పిందానికి కాదనలేనుగా'' అంటూ లౌక్యం పోయాడు హృతిక్ రోషన్. మనోడికి ఈ గ్రీకువీరుడు అనే ట్యాగ్ ఉంది కాబట్టి.. అందుకోసం ఇప్పుడు ఇలా సిక్స్ ప్యాక్ బాడీతో విరుచుకుపడుతున్నాడు. ఏదో తన స్టయిలిస్టుల మీద సాకు చెప్పేసి ఇలా తన హాట్నెస్ ను చూపిస్తున్నాడు. ఇదంతా చూసిన అమ్మాయిలు ఎలా తట్టుకుంటారు చెప్పండి? కాస్త కష్టమే కదా.

ఆ మధ్యన హృతిక్ 'కాబిల్' సినిమాతో హిట్టు కొట్టాక మరోసారి తన కెరియర్ కు బ్రేకులు వేశాడు. ఈ మధ్యన ఈయన తండ్రి రాకేష్‌ రోషన్ మాత్రం క్రిష్‌ 4 మీద వర్కు నడుస్తోందని చెప్పాడు. ఏదేమైనా కూడా మనోడు ఇలా అప్పట్లో ప్రముఖ శిల్పకారులైన మైఖేల్ యాంజిలో వంటివారు చెక్కిన శిల్పంలా తయారవ్వడం.. అబ్బో అదో కిక్కు గురూ. తన లలల బ్రాండ్ బట్టల కోసం ఇలా ఫోజులు ఇస్తున్నాడటలే.




Tags:    

Similar News