నిజమైన మేకోవర్ అంటే ఇది

Update: 2018-02-14 07:00 GMT
మనం ఎంత పెద్ద స్టార్ అన్నది ముఖ్యం కాదు. మన దగ్గరకు వచ్చిన పాత్రకు తగ్గట్టు మనల్ని మనం ఎలా మలుచుకుంటున్నాం అనేదే ఏ హీరోకైనా ప్రత్యేకతను ఆపాదిస్తుంది. అది ఛాలెంజ్ గా తీసుకున్నప్పుడే పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరుగుతాయి. దీనికి సౌత్ నార్త్ అని తేడా లేదు. శంకర్ ఐ సినిమా కోసం విక్రం ఒళ్ళుని ఎంత హూనం చేసుకున్నాడో చూసాం. సినిమా సినిమాకు మారిపోయే కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ కూడా తన నా పేరు సూర్య సినిమా కోసం ఫిజిక్ తో పాటు హెయిర్ స్టైల్ ని కూడా త్యాగం చేసి మిలిటరీలోకి మారిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉదాహరణలు కనిపిస్తాయి. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ - అమీర్ ఖాన్ లాంటివాళ్ళు ఈ క్యాటగిరీలో ముందు ఉంటారు. దంగల్ కోసం అమీర్ చూపించిన కమిట్మెంట్ ఇప్పటి హీరోలకు గైడ్ లాంటిది. ఇక తానేమి తక్కువ తినలేదు అంటున్నాడు హృతిక్ రోషన్.

పాట్నాకు చెందిన సుప్రసిద్ధ గణిత బోధకుడు ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సూపర్ 30లో హృతిక్ రోషన్ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం చాలా కసరత్తు చేసిన హృతిక్ ఆనంద్ లాగే కనిపించడం కోసం తన బాడీని షేప్ చేసుకున్న తీరు ఫోటోలలో చూసి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ధూమ్ - క్రిష్ లాంటి సినిమాల కోసం బండలు పగిలే కండలు పెంచి సిక్స్ ప్యాక్ తో యూత్ ఐకాన్ గా నిలిచిన హృతిక్ ఇంత తక్కువ టైంలో సినిమాలో పాత్ర కోసం ఇలా మొహంలో కళ తగ్గించుకుని బక్కపలచగా మారడం ఆశ్చర్యమే.

నిరుపేద విద్యార్థులలో అద్భుత ప్రతిభ కలిగిన 30 మందిని ఎంచుకుని ఆనంద్ కుమార్ ఇచ్చే కోచింగ్ గురించే ఈ సినిమా మొత్తం ఉంటుంది. అతని బాల్యం మొదలుకొని మాథ్స్ అంటే ఆసక్తి ఎలా కలిగింది, ఎన్ని ఇబ్బందులు పడి నేర్చుకున్నాడు తదితరాలన్నీ ఇందులో చూపించబోతున్నారు. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాల్ టాకూర్ హీరొయిన్ గా నటిస్తుండగా - పంకజ్ త్రిపాటి - రిత్విక్ సహోరే - జీషాన్ ఆయుబ్ - నందిత్ సింగ్ - ఆదిత్య శ్రీవాత్సవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Tags:    

Similar News