అసిస్టెంట్‌ రైట‌ర్ల‌కు ప్యాకేజీ ఎలా?

Update: 2019-05-05 01:30 GMT
టాలీవుడ్ 24 శాఖ‌ల్లో అత్యంత కాంప్లికేటెడ్ విభాగం ఏదైనా ఉందీ అంటే అది రైటింగ్ డిపార్ట్ మెంట్. సృజ‌నాత్మ‌క‌త‌తో ముడిప‌డిన విభాగ‌మిది. అస‌లు సినిమా సెట్స్ కెళ్ల‌క ముందే క్రియేటివిటీని ఓ చోట గుదిగుచ్చే ప్ర‌క్రియ స్క్రిప్టు రైటింగ్. కొంద‌రు ర‌చ‌యిత‌ల బృందం ద‌ర్శ‌కుడితో క‌లిసి డిస్క‌ష‌న్స్ చేసి.. పూర్తి స్థాయిలో  స్క్రిప్టు అభివృద్ధి చేసి ఫైన‌ల్ ఔట్ పుట్ ని సిద్ధం చేస్తారు. ఈ విభాగంలో త‌ప్పు జ‌రిగితే దానిని స‌రి చేసుకోవాల్సిన బాధ్య‌త ద‌ర్శ‌కుడిదే. ప్ర‌స్తుతం ఉన్న అగ్ర నిర్మాణ సంస్థ‌లు.. అగ్ర‌ ద‌ర్శ‌కులంతా ప్ర‌త్యేకించి స్క్రిప్టు ర‌చ‌యిత‌ల‌కు జీతాలిచ్చి మ‌రీ ప‌ని చేయిస్తున్నారంటే ఆ విభాగానికి ఉన్న ప్రాముఖ్య‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌తి నిర్మాణ సంస్థ‌కు.. ద‌ర్శ‌కుల‌కు ఆస్థాన ర‌చ‌యిత‌లు అన‌ద‌గ్గ వాళ్లు ఉంటారు. సీనియ‌ర్ రైట‌ర్ల‌కు అసిస్టెంట్లు ఉంటారు.

అదంతా స‌రే.. కృష్ణాన‌గ‌ర్.. ఫిలింన‌గ‌ర్ లో ర‌చ‌యిత‌లు కావాల‌నుకునే న‌వ‌త‌రం ప్ర‌తిభావంతులకు ఉపాధి ఎలా ల‌భిస్తుంది? అంటే ఏళ్ల‌కు ఏళ్లు ఏ ఉపాధి లేకుండా గ‌డిపేసే వాళ్లు ఇక్క‌డ ఎక్కువ‌. అవ‌కాశం ఎలా వెతుక్కోవాలి? అన్న‌ది ఒక స‌మ‌స్య అనుకుంటే.. అవ‌కాశం ఎవ‌రు క‌ల్పిస్తారు?  ఎక్క‌డ క‌ల్పిస్తారు? అన్న‌ది తెలియని వాళ్లు ఎక్కువే క‌నిపిస్తుంటారు. ఒక‌వేళ నిజంగానే ప్ర‌తిభ ఉంటే అసిస్టెంట్ రైట‌ర్లుగా చేరేందుకు కొన్ని ఛాన్సులు ఉంటాయి ఇక్క‌డ‌. అందుకు దారి వెతుక్కోవ‌డం అన్న‌ది చాలా ఇంపార్టెంట్. ఒక అసిస్టెంట్ రైట‌ర్ కి పారితోషికం లేదా ప్యాకేజీ ఎంత ఉంటుంది? అన్న‌ది ప‌రిశీలిస్తే ప్రొడ‌క్ష‌న్ కంపెనీ రేంజ్.. ద‌ర్శ‌కుడి రేంజ్.. తాము ప‌ని చేసే సీనియ‌ర్ రైట‌ర్ రేంజ్.. సినిమా బ‌డ్జెట్ రేంజ్‌.. ఇవ‌న్నీ విశ్లేషించాల్సి ఉంటుంది. 

కొన్ని ప్రామినెంట్ కంపెనీలు రైట‌ర్ల బృందానికి ఇంత అని ప్యాకేజీని ఇస్తున్నాయి. ఆ బాధ్య‌త‌ను ద‌ర్శ‌కుడికే అప్ప‌జెప్పితే ద‌ర్శ‌కుడే వాళ్ల‌కు ప్యాకేజీ ముట్ట‌జెప్పాల్సి ఉంటుంద‌ట‌.  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్.. గీతా ఆర్ట్స్.. మైత్రి మూవీ మేక‌ర్స్.. యువి క్రియేష‌న్స్.. ఇలా అగ్ర బ్యాన‌ర్లు ఎంద‌రో ట్యాలెంట్ కి అవ‌కాశాలిస్తున్నారు. క్రియేటివ్ రైట‌ర్లు.. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులకు మంచి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ఇలాంటి చోట పారితోషికాల ప‌రంగా జెన్యూనిటీకి ఏ లోటూ లేదు. ఇక అసిస్టెంట్ల ప్యాకేజీ ద‌ర్శ‌కుడిని బ‌ట్టి మారిపోతుంటుంది. `ఎఫ్ 2` చిత్రంతో రీసెంట్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన అనీల్ రావిపూడి ని ప‌రిశీలిస్తే.. త‌న‌వ‌ద్ద ప‌ని చేసే రైటింగ్ డిపార్ట్ మెంట్ కి రూ.కోటి నుంచి 3కోట్ల వ‌ర‌కూ సినిమా రేంజును బ‌ట్టి ప్యాకేజీ ఉంటుంద‌ని.. అసిస్టెంట్ రైట‌ర్ల‌కు రూ.5-10ల‌క్ష‌ల ప్యాకేజీలు ఇస్తుంటార‌ని తెలుస్తోంది.  రైట‌ర్ రేంజుని బ‌ట్టి కూడా ఇది మారుతుంది. కొంద‌రు సీనియ‌ర్ల‌కు సిట్టింగ్ (ఒక‌రోజు)కి ఇంత అని ఉంటుంది. ప‌రుచూరి సోద‌రులు.. వ‌క్కంతం వంశీ లాంటి స్టార్ రైట‌ర్లు త‌మ‌వ‌ద్ద అసిస్టెంట్ల‌కు పారితోషికాలు ఇచ్చి పోషించే ప‌ద్ధ‌తిని అమ‌లు చేసేవార‌ని చెబుతారు. ఇండ‌స్ట్రీలో టాప్ రేంజ్ రైట‌ర్లంతా ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్నారు. ఇక ర‌చ‌యిత‌ల క్రియేటివిటీని దోచుకోవ‌డం అన్న‌ది వేరొక భ‌యాన‌క‌ కోణం గురించి ఒక‌ ప్ర‌త్యేక ఆర్టిక‌ల్ లో చ‌ర్చిద్దాం.
   

Tags:    

Similar News