ఓటీటీలు సక్సెసైతే థియేటర్లను పర్మినెంట్ గా మూసేస్తారా?
మహమ్మారీ పాఠాలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా మనిషి మైండ్ సెట్ మార్చేస్తున్న సీజన్ ఇది. అన్నిటికీ కారణం కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇదో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఇకపై వినోద పరిశ్రమల్లోనూ అనూహ్యమైన మార్పులను చూడబోతున్నామన్న సంకేతం అందింది. పబ్లిక్ ప్లేసులకు వెళితే .. థియేటర్లకు వెళితే ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనన్న భయం ఇంకా వీడలేదు. ఇప్పట్లో వీడే మార్గం కూడా కనిపించడం లేదు. ఆ క్రమంలోనే జనం ఆల్టర్నేట్ వైపు చూస్తున్నారు. బుల్లితెరతో పాటు డిజిటల్ - ఓటీటీ వేదికలకు అద్భుత ఆదరణ దక్కుతోంది. కారణం ఏదైనా ఇదో పెను విప్లవానికి నాంది పలకబోతోంది. ఇకపై టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలన్నీ సొంత ఓటీటీ వేదికల్ని సిద్ధం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయన్న సమాచారం ఉంది.
ఆ దిశగా దారి చూపింది మాత్రం బాస్ అల్లు అరవింద్. ఆహా తో ఓటీటీ రంగంలో అడుగుపెట్టిన తొలి సౌత్ నిర్మాతగా ఆయన పాపులారిటీ దక్కించుకున్నారు. ఆయన బాటలోనే దిల్ రాజు సహా పలువురు నిర్మాతలు రంగ ప్రవేశం చేస్తున్నారన్న సమాచారం ఉంది. అలాగే బాలీవుడ్ లోనూ ఓటీటీ హవా అంతకంతకు విస్తరిస్తోంది. ఇప్పటికిప్పుడు తెలుగు-తమిళం-కన్నడం- హిందీ భాషలకు సంబంధించిన ఏడు సినిమాల్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమవుతోంది. అలాగే నెట్ ఫ్లిక్స్ సహా పలు కంపెనీలు ఇదే దారిలో వెళుతున్నాయి. గంపగుత్తగా నిర్మాతల నుంచి రైట్స్ కొనుక్కుంటున్నాయి కార్పొరెట్ కంపెనీలు.
అమితాబ్- ఆయుష్మాన్... విద్యాబాలన్.. జ్యోతిక.. కీర్తి సురేష్ వంటి క్రేజీ స్టార్లు నటించిన సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మునుముందు ఇదే బాటలో అగ్ర హీరోల సినిమాల్ని రిలీజ్ చేసేసే యోచనలో ఉన్నారు. ఇక వీటిలో అమితాబ్- ఆయుష్మాన్ నటించిన గులాబో సితాబో ట్రైలర్ ఈ ఆదివారం రిలీజ్ కానుంది. ట్రైలర్ తర్వాత సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వస్తుంది. అటుపై వరుసగా ఏడెనిమిది సినిమాల్ని రిలీజ్ చేసేందుకు అమెజాన్ వాళ్లు సిద్ధమవుతున్నారు. అదే బాటలో నెట్ ఫ్లిక్స్ .. ఈరోస్.. సన్ నెక్ట్స్.. హాట్ స్టార్- డిస్నీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
వరుసగా ఓటీటీల్లోనే కొత్త సినిమాలు వీక్షించే వెసులుబాటు ఉంటే ఇక జనం థియేటర్ల వైపు ఆలోచిస్తారా? ప‌్రస్తుతం ఓటీటీ కంపెనీలు అందుకు లైన్ క్లియర్ చేసే పనిలో ఉన్నాయి. ఈ నిర్భంధ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జనంలో విస్త్రతంగా ప్రచారం చేసేసుకుంటున్నారు వీళ్లంతా. తద్వారా భారీగా సబ్ స్క్రైబర్లను పొంది ఇక భవిష్యత్ ఓటీటీదేనని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజా పరిణామం నేపథ్యంలో ఇకపై అగ్రహీరోలు సైతం ఓటీటీ కంటెంట్ నే నమ్ముకోవాల్సిన సన్నివేశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంకా థియేటర్లు తెరుస్తారు అన్న బింకం ప్రదర్శించినా ఆల్టర్నేట్ గా ఓటీటీ- బుల్లితెరను ఎంచుకునేందుకు వెనకాడరన్న సంకేతాలు అందుతున్నాయి.