అయ్యో కొరటాల... ఎలా తట్టుకుంటున్నవయ్యా

Update: 2023-02-08 17:00 GMT
ఒకే ఒక్క ఫ్లాప్.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివను వెంటాడుతోంది. గతంలో తాను సినిమాలు చేసే విషయంలో ఎంతో కూల్ గా వ్యవహరించి.. హిట్లు కొట్టే ఈ డైరెక్టర్.. ఇప్పుడు కాస్త ఒత్తిడిలోనే ఉన్నట్లు అర్థం అవుతోంది. దాంతో ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా విషయంలో ఎంతో ఒత్తిడికి గురైతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో అందరూ అసంతృప్తికి గురయ్యారు. రెండేళ్ల తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎలాంటి మంచి ఫలితాన్ని ఇవ్వకుండా పోవడం మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురించింది. దానికి తోడు రామ్ చరణ్ తో చిరు కలిసి నటించిన సినిమా ఇలా అయిపోవడం మరింత బాధపెట్టింది. ఈ సినిమాకు దాదాపు వంద కోట్ల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

ఇక ఈ ఎఫెక్ట్ కొరటాల నెక్ట్స్ సినిమాపై పడింది. ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషల్‌లో వస్తోన్న NTR30 సినిమాపై కొరటాల చాలా ప్రెషర్ ఫిల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారారు.

ఆస్కార్ రేంజ్ స్థాయికి ఎదిగారు. మరోవైపు రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరోలకు ఫ్లాప్ పడుతుందనే ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరమ్ చేసిన ఆచార్య ఫ్లాప్ గా నిలిచింది. అంటే రాజమౌళి సినిమా తర్వాత చరణ్‌కు ఫ్లాప్ పడింది. ఈ సెంటిమెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా రిపీట్ అవుతుందా అనే టెన్షన్ పట్టుకుంది కొరటాలకు.

మరోవైపు ఎన్టీఆర్ 30 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. మొన్న అమిగోస్ ప్రిరిలీజ్ ఫంక్షన్‌ లో ఎన్టీఆర్... ఈనెల ఎండింగ్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక కొరటాలకు కూడా షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రస్తుతం టీమ్ షూటింగ్ కోసం సెట్స్‌ను వేస్తున్నారు. అత్యంత వైభవంగా సెట్స్‌ ను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఇక ఇఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. అయితే కొరటాల ఒత్తిడిని జయించి హిట్ కొడతాడో లేదో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News