తారా క్రిస్మస్ పార్టీలో సీక్రెట్ బోయ్ ఎవరో కానీ..
కరణ్ జోహార్ డిస్కవరీ తారా సుతారియా ప్రతి సంవత్సరం క్రిస్మస్‌ను ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేస్తుంది.;
కరణ్ జోహార్ డిస్కవరీ తారా సుతారియా ప్రతి సంవత్సరం క్రిస్మస్‌ను ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేస్తుంది. ఈ పార్టీకి కచ్ఛితంగా స్నేహితులు అంతా హాజరై ఉత్సాహంగా మత్తు మత్తుగా చిత్తుగా గడిపేస్తారు.. 2025 క్రిస్మస్ పండుగ సీజన్ కూడా దీనికి మినహాయింపు కాదు. 30 ఏళ్ల తారా తన డే వేడుకలను కొంచెం ముందుగానే ప్రారంభించింది, తన ఇంటిని అద్భుతంగా మెరిసే లైట్లతో అందంగా అలంకరించింది. పండుగకు రుచికరమైన వంటకాలను కూడా సిద్ధం చేసింది.
ఈ సమావేశంలో తారా సుతారియా ప్రియుడు వీర్ పహరియా, భూమి పెడ్నేకర్, సంగీతదర్శకుడు హిమేష్ రేషమ్మియా అతడి భార్య సోనియా కపూర్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇంతమందితో నైట్ పార్టీలో చిల్ చేసిన మరో ప్రముఖుడు కూడా ఉన్నాడు. అతడే ది గ్రేట్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి. అసలు అవ్రతమణి ఉంటే చాలు.. ఆ పార్టీకే ప్రత్యేక కళ వచ్చేస్తుంది. ఆ ఉత్సాహమే వేరే లేవల్ లో ఉంటుంది.
డిసెంబర్ 20న తారా తన క్రిస్మస్ విందు నుండి ఇన్‌స్టాలో వరుస ఫోటోలు, వీడియోలను షేర్ చేయగా అవన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ లో సునామీ స్పీడ్ తో వైరల్ అయిపోతున్నాయి. ఈ పార్టీలో సీక్రెట్ మ్యాన్ వీర్ పహారియా గురించి కూడా చాలా గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. తారా - వీర్ అందమైన జంట. ఆ ఇద్దరూ దేనినీ దాచడం లేదు. ఇప్పుడు క్రిస్మస్ పార్టీలోను తన స్పెషల్ మ్యాన్ కి తారా చిక్ పై ముద్దులిచ్చింది. షాన్డిలియర్లు, ఎరుపు పూల అలంకరణలు, క్రిస్మస్ చెట్లు, మెరుపుల కొవ్వొత్తులతో వెదర్ ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంటే తారా ఇచ్చిన ఆ తీపి ముద్దును వీర్ ఎంతగానో ఆస్వాధించాడు.
ఈ ఉత్సాహాన్ని షేర్ చేస్తూ.. వేడుకలను నిర్వహించడానికి తెరవెనుక చేసిన కృషిని వివరిస్తూ తారా ఒక నోట్ కూడా రాసింది. వంట చేయడం, బేకింగ్ చేయడం, టేబుల్ సెట్టింగ్‌లను రెడీ చేయడం, దేశవ్యాప్తంగా టపాకాయలను తీసుకురావడం, కరోల్స్ పాడటం, టర్కీని పరిపూర్ణం చేయడం వంటి రోజుల గురించి తారా ఉత్సాహంగా గుర్తు చేసుకుంది. పార్టీ కోసం తారా గ్లామరస్ గా రెడీ అయి వచ్చింది. అద్భుతమైన బ్లాక్ డ్రెస్ లో మతులు చెడగొట్టింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, తారా సుతారియా తదుపరి రాక్ స్టార్ యష్ సరసన టాక్సిక్ చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం తారా కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల ఈ బ్యూటీ పూర్తిగా వీర్ పహారియాతో షికార్లలో మునిగి తేల్తోంది.