సుజీత్‌ను ఇరుకున పెట్టేసిన గ్రేట్ డైరెక్టర్

కేవలం 24 ఏళ్ల వయసులోనే తన తొలి సినిమా ‘రన్ రాజా రన్’ తీసి పెద్ద హిట్టు కొట్టిన సుజీత్.. రెండో సినిమాకే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో జట్టు కట్టి ‘సాహో’ తీశాడు.;

Update: 2025-12-22 03:49 GMT

కేవలం 24 ఏళ్ల వయసులోనే తన తొలి సినిమా ‘రన్ రాజా రన్’ తీసి పెద్ద హిట్టు కొట్టిన సుజీత్.. రెండో సినిమాకే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో జట్టు కట్టి ‘సాహో’ తీశాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ చేశాడు. ఐతే తొలి సినిమా తర్వాత ఈ రెండు సినిమాలు చేయడానికి అతడికి దాదాపు పదేళ్ల సమయం పట్టింది. సుజీత్ ఇంత పెద్ద సినిమాలు తీయడం గొప్ప విషయమే కానీ.. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ స్టార్ హీరోల కోసం ఇంతింత సమయం పెట్టాల్సి రావడం కరెక్టా అనే ప్రశ్నలూ తలెత్తుతుంటాయి.

సినిమా తీయడం కంటే ఈ స్టార్ హీరోలు అందుబాటులోకి వచ్చేందుకు చాలా సమయం వెయిట్ చేయడంలోనే చాలా కాలం గడిచిపోయింది. సుజీత్‌ల ా చాలామంది యువ దర్శకులు స్టార్ల కోసం వెయిట్ చేస్తూ ఇలా చాలా సమయాన్ని వృథా చేస్తున్నారనే చర్చ జరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీలో.

తాజాగా తమిళ క్రిటిక్ భరద్వాజ్ రంగన్‌తో జరిగిన డైరెక్టర్స్ రౌండ్ టేబుల్‌లో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. ఈ టాపిక్ మీద మాట్లాడాడు. ఇందులో సుజీత్ కూడా పాల్గొనడం గమనార్హం. అతడి ముందే దర్శకులు స్టార్ల కోసం వెయిట్ చేయడం గురించి మాట్లాడాడు అనురాగ్. ‘‘ప్రస్తుత డైరెక్టర్లు కథ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు. వాళ్లకు ఒక ఐడియా వస్తోంది. వాళ్లు ఆ ఐడియాతో ఒక పెద్ద సినిమా తీయాలనుకుంటున్నారు. అందుకోసం నాలుగేళ్లు ఎదురు చూస్తున్నారు.

పెద్ద బడ్జెట్లో ఆ సినిమా తీయాలనుకుంటున్నారు. వాళ్లు ఈ సినిమాతో ఎక్కువ ఎంగేజ్ కావట్లేదు. వాళ్లు వెయిటింగ్‌లో ఉండిపోతున్నారు. అది ఆందోళన కలిగించే పరిణామం’’ అని అనురాగ్ చెప్పాడు. ఆ కామెంట్లు సుజీత్‌కు గట్టిగానే తాకి ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ ఈ విషయంలో అతను ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. మరోవైపు అనురాగ్.. దక్షిణాది చిత్రాల పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. తన ఫేవరెట్ హీరో రజినీకాంత్ అని చెప్పిన అనురాగ్.. ‘అమితాబ్ సినిమా ‘గెరాఫ్తర్’లో రజినీకాంత్ చచ్చిపోయే ముందు సిగరెట్ తాగుతూ పొగలు వదిలే షాట్ చూసి ఆయనకు ఫ్యాన్ అయ్యానని.. ‘లియో’లో తాను చనిపోయే సన్నివేశంలోనూ ఆ షాట్‌ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించానని చెప్పాడు.

Tags:    

Similar News