చివరి కోరిక తీరకుండానే మరణించిన సెలబ్రిటీలు..
సాధారణంగా మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. అయితే ఆ కోరికను కొంతమంది బ్రతికుండగానే నెరవేర్చుకుంటే...మరికొంతమంది ఆ కోరిక తీరకుండానే స్వర్గస్తులవుతూ ఉంటారు.;
సాధారణంగా మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. అయితే ఆ కోరికను కొంతమంది బ్రతికుండగానే నెరవేర్చుకుంటే...మరికొంతమంది ఆ కోరిక తీరకుండానే స్వర్గస్తులవుతూ ఉంటారు. ఇక సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చివరి కోరిక తీరకుండానే మరణించిన సెలబ్రిటీల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ జాబితాలో ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం.
ధర్మేంద్ర:
లెజెండ్రీ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ధర్మేంద్ర.. ఇటీవల తనువు చాలించారు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన మరణాంతరం కూడా ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ధర్మేంద్ర తనయుడు సన్నీ డియోల్.. తన తండ్రి అభిమానులను మరింత దుఃఖానికి గురి చేసే ఒక వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ధర్మేంద్ర చివరి చిత్రం ఇక్కీస్ ఆఖరి రోజు షూటింగ్ సందర్భంగా తీసిన వీడియో అది. అందులో ఆయన మాట్లాడుతూ.. "నా చివరి చిత్రాన్ని భారత్, పాకిస్తాన్ ప్రజలు చూడాలని కోరుకున్నాను" అంటూ తెలిపారు.. అయితే ఈయన ఆఖరి కోరిక తీరలేదని చెప్పాలి. కొన్ని రోజుల నుంచి భారత్ - పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే గానే ఉండడం .. ఇండియన్ మూవీస్ ఏవి కూడా పాకిస్తాన్లో విడుదల కాలేదు. దీన్ని బట్టి చూస్తే ధర్మేంద్ర ఆఖరి కోరిక తీరలేదని చెప్పాలి.
శరత్ బాబు..
విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న శరత్ బాబు సుమారుగా 250కి పైకి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన కూడా హార్సిలీహిల్స్ లో ఒక ఇల్లు కట్టుకోవాలని బలంగా కోరుకున్నారట. ఇంటి నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. కానీ ఆ పనులు పూర్తీ కాకముందే కన్నుమూశారు.
సౌందర్య..
సౌందర్య పేరుకే కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అని చెప్పాలి. పక్కింటి అమ్మాయిలా ఎంతగానో ఆదరించిన ఈమె కూడా చివరి కోరిక నెరవేరకుండానే స్వర్గస్తురాలు అయింది. సామాజిక సేవ చేయాలనే కృషితోనే రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న సౌందర్య అలా 2004లో బిజెపిలో చేరి ఆ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగానే దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో మరణించింది. సౌందర్య అకాల మరణంతో సమాజానికి సేవ చేయాలనే ఆమె ఆశయం కూడా కలగానే మిగిలిపోయింది.
నర్సింగ్ యాదవ్:
భయంకరమైన విలనిజంతో పాటు కామెడీలతో ప్రేక్షకులను అలరించిన ఈయన కొన్ని చిత్రాలను నిర్మించాలని అనుకున్నారట. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు.
మనోరమ:
భావోద్వేగ పాత్రలు చేయాలని ఆశపడ్డ ఈమె.. అది నెరవేరకుండానే చనిపోయారు. 1000 పైగా చిత్రాలలో నటించిన ఈమె.. తన కోరికను మాత్రం తీర్చుకోలేకపోయారు మనోరమ.