అందరినీ ఆశ్చర్య పరిచిన డ్యాన్సర్.. చూస్తే షాకే

Update: 2020-12-18 13:30 GMT
భారతీయ చిత్ర పరిశ్రమలో అద్బుమైన డ్యాన్స్ మాస్టర్ పేరు తెచ్చుకున్న వారిలో గ‌ణేష్ ఆచార్య‌ ఒకరు. దాదాపు 30 సంవత్సరాల పాటు.. వేసిన స్టెప్పు మళ్లీ వేయకుండా వంద‌ల సినిమాల‌కు కొరియోగ్ర‌ఫీ చేస్తున్నాడు ఈ బాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్. బాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో స్టెప్పులేయించిన ఘ‌న‌త ఈ ఆచార్య సొంతం. తెలుగులో కూడా స్టయిల్ స్టార్ అల్లు అర్జున్‌ కు డ్యాన్స్ పాఠాలు చెప్పాడు. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాల‌కు వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఐతే కొన్నేళ్ల కింద‌ట గ‌ణేష్‌ను చూసిన వాళ్లు.. ఇప్పుడు అత‌ణ్ని చూసి ‘గుర్తు ప‌ట్ట‌లేకుండా మారిపోయాడు’ అంటున్నారు.

వంద కేజీలు తగ్గాడు..
కొన్నేళ్లుగా గణేష్ ఆచార్య విపరీతంగా బరువు పెరుగుతూ వచ్చాడు. ఒక ద‌శ‌లో 200 కిలోలకు చేరుకున్నాడు. అతని బరువు చూసి అందరూ చెవులుు కొరుక్కనే వారు. అయితే.. అదంతా గతం. ఇప్పుడు ఏకంగా వంద కిలోల బ‌రువు త‌గ్గించుకుని పాత గెటప్ లోకి వచ్చేశాడు ఆచార్య. తాజాగా.. ‘కపిల్‌ శర్మ షో’కు సంబంధించిన ప్రోమోలో కనిపించిన గణేశ్..‌ 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వర్కవుట్లతోనే..
అయితే.. బరువు తగ్గడానికి బేరియాట్రిక్, లైపో వంటి స‌ర్జ‌రీలేవీ చేయించుకోలేదని వెల్లడించాడు గణేష్. కేవ‌లం వ‌ర్క‌వుట్లు, డైట్ ద్వారానే ఇంత బ‌రువు త‌గ్గాడ‌ట‌. కొన్ని నెలల పాటు అత్యంత క‌ఠిన‌మైన‌ వర్కౌట్లు చేసినట్లు చెప్పాడు. ఆ విషయం నిజమేనని చెబుతున్నాయి అతని వీడియోలు. గణేష్ చేసిన కఠిన వర్కవుట్ల వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియోలు చూస్తే.. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చన్నది నిజమేనని మరోసారి అనిపిస్తుంది.
Tags:    

Similar News