• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తలైవి బయోపిక్ ఐదు బాషలలో...

తలైవి బయోపిక్ ఐదు బాషలలో రానుందా..?

By - Tupaki Desk
Update: 2020-04-17 10:50 GMT
ఒక సినీతారగా - ఒక పార్టీ అధినేత్రిగా - ఒక ముఖ్యమంత్రిగా - ఓ ఐరన్ లేడీగా.. జయలలిత చరిత్ర ఎంతో గొప్పది. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులు - అనూహ్య సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే బయోపిక్ లు రూపొందించే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అయింది. ఇప్పుడామె జీవితాన్నే కథాంశంగా బయోపిక్ రూపొందిస్తున్నారు. తెలుగు - తమిళం - కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో కథానాయికగా విభిన్న పాత్రలు పోషించారు జయలలిత. తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'తలైవి' అనే పేరు ఖరారు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

'మణికర్ణిక' వంటి హిస్టారికల్ మూవీ తర్వాత రనౌత్ నటిస్తోన్న బయోపిక్ ఇదే. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ తో పాటు 'డర్టీ పిక్చర్' కథా రచయిత రజత్ అరోరా కథా సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు. జయలలిత జీవితంలోని ప్రధాన ఘట్టాలైన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయట. పదహారేళ్ల వయసు నుండి ఆరు పదుల వయసు వరకూ మొత్తం నాలుగు గెటప్ లలో కంగనా కనిపించనుందట. తెలుగు - తమిళ హిందీ బాషలలో రూపొందుతున్న ఈ సినిమాపై కన్నడ - మలయాళం ఇండస్ట్రీలలో కూడా పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం. కాబట్టి వంద కోట్లు పెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారట.

ఇదిలా ఉండగా ఈ సినిమాకోసం కంగనా తమిళం కూడా నేర్చుకుంటుందట. తాజా సమాచారం ప్రకారం.. కంగనా మేకప్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను నియమించారట. అయితే కంగనా తలైవి లుక్ లో కనిపించలేదని విమర్శలు రావడంతో చిత్రబృందం కంగనా మేకప్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పైగా కరోనా కారణంగా మేకప్ టెక్నీషియన్స్ మారే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ బదులు ఇక్కడి టెక్నీషియన్స్ నే నియమించనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి కంగనా తలైవిగా ఎలా అలరించనుందో..!
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • kangana 
  • Thalaivi 
  • Kangana in 4 getups 
  • Releasing In 5 languages 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS