ఆయన టార్గెట్ పెద్ద స్టార్లే!

Update: 2019-11-15 06:40 GMT
ఆయన ఓ టాప్ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్. కొన్ని సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తాడు.. కొన్ని సినిమాలకు మాత్రం సోసో మ్యూజిక్ అందిస్తాడని పేరు. పెద్ద స్టార్ హీరోల సినిమాలకు ఆయన పనిచేసే తీరు వేరే గా ఉంటుందట.  వారికి సూపర్ మ్యూజిక్ ఇస్తూ నెక్స్ట్ సినిమా కు కూడా తననే పెట్టుకునేలా ప్రయత్నం చేస్తాడట.

ఈమధ్య అలానే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా కు అద్భుతమైన ట్యూన్లు అందించినా సదరు హీరో మాత్రం నెక్స్ట్ సినిమా కు వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను ఫైనలైజ్ చేసే ఆలోచన లో ఉన్నాడట.  కారణం ఏంటంటే ఈ సంగీత దర్శకుడు చివరి నిముషం వరకూ సాంగ్స్ ఇవ్వడని.. రీ రికార్డింగ్ విషయం లో చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ పాటల డెలివరీ విషయం లో ఆలస్యం చేస్తాడనే అభిప్రాయం ఉండడమే. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ల విషయం లో డిలే చేయడం ఫిలిం మేకర్లకు ఇబ్బంది గా మారుతోందని టాక్.  అందుకే ఇతనికి పెద్ద స్టార్లు ఎక్కువ మంది ఇతనికి ఛాన్స్ ఇవ్వడం లేదని అంటున్నారు.

అన్నీ సినిమాల కు మంచి క్వాలిటీ మ్యూజిక్ అందించడం.. చెప్పిన సమయానికి పని పూర్తి చేయడం అలవాటు చేసుకుంటే మాత్రం ఇతనికి టాలీవుడ్ లో ఇంకా క్రేజీ ఆఫర్లు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి ఎప్పట్లాగే నిర్మాతలను లాస్ట్ మినిట్ లో ఇబ్బందుల కు గురి చేస్తాడో లేదా తన పద్ధతి మార్చుకుంటాడో వేచి చూడాలి.
Tags:    

Similar News