• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భర్తలతో విడిపోయి ఒంటరి...

భర్తలతో విడిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న హీరోయిన్స్..!

By - Tupaki Desk
Update: 2020-07-23 00:30 GMT
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన చాలామంది హీరో హీరోయిన్లు రియల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కున్న సంఘటనలు ఎన్నో చూసాం. ఈ నేపథ్యంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందిన హీరోయిన్స్ వైవాహిక జీవితాలు సాఫీగా సాగలేదు. పెళ్లి అయిన తర్వాత భర్తతో గొడవలు వచ్చి విడిపోయిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ భర్తలతో విడిపోయిన తర్వాత మరో వివాహం చేసుకొని హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. మరికొందరు మాత్రం మరో వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్నారు.

భర్తతో విడిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న హీరోయిన్స్ లో భానుప్రియ గురించి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన భానుప్రియ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి 1998లో ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాకి వెళ్లిపోయింది. అయితే ఒక పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2005లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియాకి తిరిగొచ్చిన భానుప్రియ మళ్ళీ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. ప్రస్తుతం తన కూతురుతో కలిసి జీవిస్తోంది.

సీనియర్ హీరోయిన్ రజినీ కూడా భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా గడుపుతోంది. సౌత్ లో ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న రజిని సక్సెస్ ఫుల్ లైఫ్ ని లీడ్ చేయలేకపోయింది. ఒక ఎన్నారై ని వివాహం చేసుకున్న రజిని ఆస్తి గొడవల వలన విడాకులు తీసుకుంది. ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినా ఆఫర్స్ రాలేదు. కాకపోతే బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరించింది.

'నరసింహనాయుడు' 'తమ్ముడు' వంటి సినిమాల్లో నటించిన ప్రీతీ జింగానియా వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు. బాలీవుడ్ డైరెక్టర్ పర్వీన్ డబ్బస్ ని వివాహం చేసుకున్న ప్రీతి ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం తన కొడుకుతో కలిసి ఒంటరి జీవితం గడుపుతోంది. ఇక హీరోయిన్ సారిక కూడా కమల్ హాసన్ తో విడిపోయి ఒంటరిగా గడుపుతోంది. కమల్ హాసన్ గౌతమితో రిలేషన్ కొనసాగించినా సారిక మాత్రం శృతి హాసన్ - అక్షర హసన్ లను చూసుకుంటూ మరో పెళ్లి చేసుకోలేదు.

ఇక 'బెజవాడ' 'నాయక్' 'ఇద్దరమ్మాయిలతో' 'రఘువరన్ బీటెక్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ జీవితం కూడా సాఫీగా సాగలేదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరి వివాహం మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసింది. అమలాపాల్ తో విడాకులు తీసుకున్న తర్వాత విజయ్ మరో వివాహం చేసుకున్నాడు. అమలాపాల్ మాత్రం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా గడుపుతోంది. ఇటీవల ఓ వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు వస్తున్నా అమలాపాల్ మాత్రం వెల్లడించలేదు.

'బద్రి' హీరోయిన్ రేణు దేశాయ్ వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు. కొన్నేళ్లు సహజీవనం చేసి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ని వివాహం చేసుకుంది రేణు. వీరికి అకిరా నందన్ - అధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ విడిపోయారు. విడాకుల అనంతరం పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకున్నాడు. ఇక రేణు దేశాయ్ కూడా పూణే కి చెందిన ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె పెళ్లి చేసుకున్నట్లు తేలియలేదు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది రేణు దేశాయ్.

వీరితో పాటు సీనియర్ నటీమణులు శారద - రేవతి - రమాప్రభ - ప్రేమ - సుకన్య - అంబికా ప్రియరామన్ - మంజు వారియర్ వైవాహిక జీవితాలు కూడా సాఫీగా సాగలేదు. వీరు కూడా తమ భర్తలతో వచ్చిన గొడవల వల్ల విడాకులు తీసుకొని ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఏదేమైనా సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్ల పాటు అలరించిన హీరోయిన్ల జీవితాలలో ఇలాంటి సంఘటలు చోటు చేసుకోవడం బాధాకరమైన విషయమనే చెప్పాలి.
Tags:    
  • Heroines 
  • Bhanu Priya 
  • Amala Paul 
  • Renu Desai 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS