ఈ తెలుగు సినీన‌టిని మోసం చేసినోళ్లు దొరికిపోయారు

Update: 2020-06-30 04:00 GMT
ప్ర‌ముఖ సినీ న‌టి ష‌మ్నా ఖాసీం (పూర్ణ)‌ను ఇబ్బందుల‌కు గురి చేసిన వారి పాపం పండింది. రవిబాబు తెరకెక్కించిన అవును, అవును 2 సినిమాలతో  మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం తమిళ మలయాళ భాషలలో నటిస్తుంది. కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో తన సొంత రాష్ట్రం కేరళకు పూర్ణ వెళ్ళింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఓ గ్యాంగ్ ఎన్నారైల పేరుతో మోసం చేసింది.ఇబ్బందుల‌కు గురి చేసింది. ఆ మోస‌గాళ్ల‌ను పోలీసులు ప‌క్కా ఆధారాల‌తో అరెస్టు చేశారు.

లాక్ డౌన్ స‌మ‌యంలో కేర‌ళ‌లోని త‌న ఇంట్లో ఉన్న పూర్ణ‌ను కొంద‌రు వ్య‌క్తులు పెళ్లి సంబంధం పేరుతో ఆశ్ర‌యించారు. త్రిసూర్‌కు చెందిన శరత్‌, ష‌రీఫ్‌‌, రఫీక్‌, రమేశ్ ఈ గ్యాంగ్ స‌భ్యులు కాగా, ష‌రీఫ్ వీరిలో ముఖ్యుడు. తాను ఎన్నారైన‌ని, త‌న‌కు బంగారం బిజినెస్ ఉంద‌ని సంప్ర‌దించి అనంత‌రం ఆమె ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు గుంజే ప్ర‌య‌త్నం చేశారు. ఆమె ఫొటోలను మార్పింగ్ చేసి బెదిరించారు. వరుస ఫోన్ కాల్స్ మరియు, మెసేజ్‌లతో టార్చ‌ర్ చేశారు. సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్న వారిపై హీరోయిన్ పూర్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ఏ నెంబర్ నుండి కాల్స్ వస్తున్నాయో అవి పోలీసులకు ఇచ్చింది. తన ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగ్గిన  పోలీసులు ఆ ఫోన్ నంబర్ల ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేశారు.

సైబర్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప్ర‌ధాన నిందితుడు మ‌హ‌మ్మద్‌ ష‌రీఫ్ త‌న వ్యాపారానికి మోడ‌ల్లు కావాల‌ని ప‌లువురిని ఆశ్ర‌యిస్తుంటాడు. పెళ్లి సంబంధాల ప్రస్తావ‌న‌తోనూ స్త్రీల‌కు ప‌రిచ‌యం అయి అనంత‌రం మోసం చేస్తుంటాడు. పూర్ణ విష‌యంలోనూ అలాగే కుట్ర చేశాడు. ప‌క్కా ఆధారాల‌తో అరెస్టు చేసిన పోలీసులు ఆ దుర్మార్గుడిని ఉమెన్ ట్రాఫికింగ్‌, మోసం, సైబ‌ర్ చ‌ట్టాల ప్ర‌కారం అరెస్టు చేశారు. సెల‌బ్రిటీలు, మ‌హిళ‌లు త‌మ‌ను సంప్ర‌దించే అప‌రిచితుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పోలీసులు సూచించారు.
Tags:    

Similar News