విల‌న్ గా అమ్మడు ఎలా మెప్పిస్తుందో..?

Update: 2021-01-03 02:30 GMT
నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నారు. అందులో ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర కాగా మరో క్యారక్టర్ అఘోరా అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన 'అఖిల్' బ్యూటీ సయాషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే హీరోయిన్ పూర్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. అయితే బీబీ3 లో పూర్ణ క్యారక్టర్ కి సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ సర్క్యులేట్ అవుతోంది.

ఈ చిత్రంలో పూర్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనుందట. ఈ క్యారెక్ట‌ర్ ని బోయపాటి శ్రీను చాలా డిఫ‌రెంట్ గా డిజైన్ చేస్తున్నాడ‌ని టాక్. ఒకవేళ ఈ రోల్ లో క్లిక్ అయితే పూర్ణ ఆ త‌రువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌చ్చని అంటున్నారు. ఎందుకంటే ఈ టైపు క్యారెక్ట‌ర్స్ ప్రస్తుతం సౌత్ లో పోషించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ మాత్ర‌మే అలాంటి పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు పూర్ణ సక్సెస్ అయితే ఆమె త‌రువాత ఆ ప్లేస్ లోకి రావ‌చ్చు. మరి బీబీ3 పూర్ణకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.
Tags:    

Similar News