• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రగ్స్ కేసు: హీరోయిన్లే...

డ్రగ్స్ కేసు: హీరోయిన్లే కాదు.. హీరోల పేర్లు కూడా తెరపైకి రానున్నాయా?

By - Tupaki Desk
Update: 2020-09-09 02:30 GMT
సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదులుతున్నట్లు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా బాలీవుడ్ స్టార్ట్ అయిన డ్రగ్స్ మాఫియా ప్రకంపనలు శాండిల్ వుడ్‌ కు కూడా పాకాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీని ఛేదిస్తున్న క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటకొచ్చింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగుల ఆధారంగా బయటకు వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ద్రుష్టి సారించారు. ఇప్పటికే పలువురు డ్రగ్ డీలర్లను రియా సోదరుడిని అరెస్ట్ చేసి విచారించిన ఎన్సీబీ అధికారులు.. తాజాగా రియాను కూడా అరెస్ట్ చేసారు.

మరోవైపు శాండిల్‌ వుడ్‌ డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు పలువురిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో 'బుజ్జిగాడు' 'సర్ధార్ గబ్బర్ సింగ్' ఫేమ్ సంజన గల్రానీ సన్నిహితుడు రాహుల్‌ ను అరెస్ట్ చేసిన సీసీబీ అధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై స్పందించిన సంజన తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ 'తానేమీ ఉగ్రవాదిని కానని.. సినీరంగంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నానని.. ఇండస్ట్రీలో ఏ ఇష్యూ వచ్చినా హీరోయిన్లనే బలిపశువుని చేస్తారని.. హీరోలపై ఆరోపణలు చేసే ధైర్యం చేయరని' చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో సంజన ఈవెంట్ మేనేజర్ ఇచ్చిన సమాచారంతో ఆమె ఇంట్లో సోదాలు జరిపిన సీసీబీ అధికారులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కు సంబంధించిన వేరు వేరు కేసుల్లో ఇప్పటి వరకు ముగ్గురు హీరోయిన్స్ అరెస్ట్ అయ్యారు. అయితే వీరి ద్వారా హీరోల పేర్లు సైతం తెరపైకి వస్తాయేమో అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

కాగా, రియా చక్రవర్తిని విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది. ఇండస్ట్రీలోని ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లు జాతీయ మీడియా చెప్తోంది. ఇక కంగనా సైతం బాలీవుడ్ స్టార్ హీరోలు ఖరీదైన డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో రియా అరెస్ట్ పై స్పదించిన కంగనా.. ''ఈ కేసులో రియాను బలిపశువును చేస్తారని నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాను. ఆమె గోల్డ్ డిగ్గర్ కావొచ్చు.. డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చు. కానీ విచారణలో ఆమె అసలు రహస్యాలు బయటపెట్టాలి. సుశాంత్ మరణం వెనకున్న మాస్టర్ మైండ్స్ ఎవరో చెప్పాలి. అతని కెరీర్‌ ను నాశనం చేసింది.. అతని సినిమాలను లాగేసుకుంది.. అతనికి డ్రగ్స్ ఇచ్చింది ఎవరో రియా బయపెట్టాలి'' అని చెప్పుకొచ్చింది. కంగనా అనుమానిస్తున్నట్లు బాలీవుడ్ లోని ప్రముఖులు ఈ కేసులో బయటకు వస్తారేమో చూడాలి. ఇక సౌత్ ఇండస్ట్రీలోనూ ఇద్దరు హీరోయిన్ల అరెస్ట్ తో డ్రగ్స్ మాఫియాతో లింకులున్న హీరోల పేర్లు కూడా త్వరలోనే బయటకు వస్తాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారిందని చెప్పవచ్చు.
Tags:    
  • Drugs Case 
  • Rhea Chakraborty 
  • Heroes names 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS