టాలీవుడ్: హీరోలే నిర్మాతలు.. నిర్మాతలే హీరోలు..!
టాలీవుడ్ లో నిర్మాతలు హీరోలు అంటూ సెపరేట్ గా లేరు. ఇప్పుడున్న హీరోలందరూ నిర్మాతలుగా మారి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. మరికొందరు హీరోలు వేరే హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హవా నడిపిస్తున్న హీరోలందరికీ సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ముందుగానే తాము సైన్ చేయబోయే చిత్రాలలో తమ బ్యానర్ భాగస్వామ్యం ఉండేలా అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. దీంతో రెమ్యూనరేషన్ తో పాటుగా ప్రాఫిట్ షేర్స్ మరియు కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కుతాయి. మరికొందరు తమ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ని నిర్మాణంలోకి తీసుకొచ్చి, వారి ద్వారా లాభం పొందుతున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్న అక్కినేని నాగార్జున ఎప్పటి నుంచో ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. NBK ఫిలిమ్స్ బ్యానర్ ను స్థాపించిన నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడు ఇతర నిర్మాతలతో కలిసి తాను నటించే సినిమాలని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి తాజాగా 15 సినిమాలను నిర్మిచేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. లక్ష్మీ ప్రసన్న పతాకంపై మంచు మోహన్ బాబు ఎప్పటి నుంచో సినిమా తీస్తూ వస్తున్నారు.. ఆయన బాటలో తనయులు విష్ణు - మనోజ్ నడుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్ పై మంచు విష్ణు సినిమాలు చేస్తుంటే.. MM అనే కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన మంచు మనోజ్ నిర్మాతగా మారాడు.
మహేష్ బాబు ఒకప్పుడు తన సోదరి మంజుల స్థాపించిన ఇందిరా ప్రొడక్షన్ మరియు అన్న రమేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ ను ప్రమోట్ చేసేవారు. ఆ తర్వాత GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ని ప్రారంభించి.. ఇతర బ్యానర్లతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. అలానే బయట హీరోలతో కూడా మహేష్ సినిమాలు తీస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ ను ప్రారంభించిన రామ్ చరణ్.. వరుసగా తన తండ్రి చిరంజీవి సినిమాలను నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు ఇప్పుడు తమ్ముడు జూ.ఎన్టీఆర్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం తాను నటించబోయే అన్ని సినిమాల ప్రొడక్షన్ లో అన్న బ్యానర్ ను ఇన్వాల్వ్ చేస్తున్నాడు.
ప్రభాస్ తన ఫ్యామిలీకి చెందిన గోపీకృష్ణ మూవీస్ లో సినిమాలు చేస్తూనే.. తన ఫ్రెండ్స్ స్థాపించిన యూవీ క్రియేషన్స్ కు అండగా ఉంటున్నాడు. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ తో పాటుగా తన బంధువులు - స్నేహితులకు సినిమాలు చేసి పెడుతున్నాడు. ఆర్.నారాయణ మూర్తి తాను నటించే సినిమాలను స్వయంగా నిర్మిస్తారు. వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై సందీప్ కిషన్ సినిమాలు చేస్తున్నాడు. హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో నితిన్ బయటి హీరోలతో కూడా సినిమాలు చేశాడు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన నాని.. ఇతర హీరోల సినిమాలని నిర్మిస్తున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీకి సురేష్ ప్రొడక్షన్స్ ను వెంకటేష్ - రానా చూసుకుంటున్నారు. కింగ్ ఆఫ్ ది హిల్ సంస్థను స్థాపించిన విజయ్ దేవరకొండ.. తమ్ముడితోనే కాకుండా వేరే హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నాడు. వీరి బాటలో సుధీర్ బాబు కూడా ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడు. ఇలా టాలీవుడ్ హీరోలందరూ రెండు పడవల మీద నడుస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.