పాపం రామ్.. బాగా వెనుకబడిపోయాడు

Update: 2017-03-23 07:19 GMT
ఎన్నో ఫ్లాపు దెబ్బలు తినేశాక ''నేను శైలజ'' సినిమాతో కాస్త కోలుకున్నాడు సీతారాం చౌదరి పోతినేని ఎలియాస్ రామ్. అయితే మనోడు వెంటనే మరోసారి తనకు బాగా నచ్చిన మాస్ సినిమాలకే మొగ్గుచూపి.. ''హైపర్'' సినిమతో భారీ స్ర్టోకే తినేశాడు. అందుకే ఇప్పుడు మనోడు తదుపరి సినిమా బాగా లేటవుతోంది. కరుణ్‌ కరన్ తో ఒక సినిమా.. కిషోర్ తిరుమలతో ఒక సినిమాను చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.

ఇక సిక్స్ ప్యాక్ బాడీ చూపించడం అనేది ఎప్పుడో చాలామంది హీరోలు మొదలెట్టేశారు. బుజ్జిగాడులో ప్రభాస్.. అలాగే దేశముదురులో బన్నీ.. ఇలా అందరూ ఎప్పుడో చేసిపాడేశారు. కాని రామ్ మాత్రం కొత్త లుక్ తో కొత్త ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు కొత్తగా సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. అయితే కంటెంట్ లో బలం లేకుండా ఎంతసేపూ సిక్స్ ప్యాకులూ.. కొత్త హెయిర్ స్టయిల్స్ చూపిస్తే మాత్రం పెద్దగా లాభం ఏమీ ఉండదు. పైగా సిక్స్ ప్యాక్ అంటే ఇప్పుడు అంతటి ఎక్సయిట్మెంట్ కూడా జనాల్లో లేదు.

ఏదైమైనా కూడా కథల ఎంపికలో తేడా రావడం వలన రామ్ చాలా వెనుకబడిపోయాడనే చెప్పాలి. ఈసారైన మాంచి కథతో ముందుకొచ్చి.. దానితో పాటు ఈ సిక్స్ ప్యాక్ తో కూడా కాస్త సెన్సేషన్ క్రియేట్ చేసి.. హిట్టు రూట్లో పడతాడని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News