• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీ సపోర్ట్ కావాలి అంటున్న...

మీ సపోర్ట్ కావాలి అంటున్న హీరో నిఖిల్

By - Tupaki Desk
Update: 2019-04-25 10:21 GMT
యువ హీరో నిఖిల్ తాజా చిత్రం 'అర్జున్ సురవరం' రిలీజ్ డేట్ విషయంలో చాలా రోజుల నుండి కన్ఫ్యూజన్ నెలకొంది.  ఇప్పటికే ఈ సినిమాను రెండు సార్లు వాయిదా వేసిన నిర్మాతలు మరోసారి తాజాగా వాయిదా వేశారని.. మే 1 న సినిమా రిలీజ్ కావడంలేదని ఉదయాన్నే వార్తలు వచ్చాయి.  ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన హీరో నిఖిల్.. ఈ సినిమాకోసం వెయిట్ చేయించినందుకు అభిమానులను క్షమాపణలు కోరాడు. 

తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'అర్జున్ సురవరం' విడుదల గురించి నేను ఇలా ఫీల్ అయ్యాను అంటూ ఒక లెటర్ పోస్ట్ చేశాడు.  ఒక సంవత్సరం తర్వాత ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు మే 1 న రావాలని అనుకున్నామని కానీ 'అవెంజర్స్' రూపంలో ఎదురుదెబ్బ తగిలిందని తెలిపాడు.  ఈ సినిమాను నమ్మి హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ల సూచన మేరకు విడుదలను వాయిదా వేస్తున్నామని చెప్పాడు. ఇలా సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేయడం బాధాకరమే కానీ డబ్బు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో వారి నిర్ణయాన్ని గౌరవించి రిలీజును వాయిదా వేయక తప్పలేదని అన్నాడు.  కొత్త రిలీజ్ డేట్ కోసం నేనుకూడా మీలాగే ఎదురు చూస్తున్నానని.. ఈ సమయంలో మీ సపోర్ట్ కావాలని తెలిపాడు.

ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లయిన ఏషియన్ సినిమాస్ వారు కూడా 'అర్జున్ సురవరం వాయిదాకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. "అర్జున్ సురవరం సినిమా రెడీగా ఉంది. సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ సాధించింది. ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతో మేము థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాం.  కానీ ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు డీసెంట్ గా కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. మరోవైపు 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమాకు క్రేజ్ అసాధారణంగా ఉంది.  దీంతో స్క్రీన్స్ దొరకడం కష్టం.. ముఖ్యంగా మల్టిప్లెక్సులలో స్క్రీన్స్ లభించడం కష్టం. అందుకే మేము నిర్మాతలను.. హీరోను.. ఫిలిం యూనిట్ వారిని సినిమా వాయిదా వేయాల్సిందిగా కోరాము. వారు మా అభ్యర్ధనను మన్నించి సినిమా విడుదలను వాయిదా వేశారు.  ఈ సినిమాను 'మహర్షి' రిలీజ్ అయిన తర్వాత ఒక అనువైన డేట్ చూసి విడుదల చేస్తాం" అని తెలిపారు. 

ఈ ప్రెస్ నోట్ ను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసిన నిఖిల్ "సినిమాను వాయిదావేయడం నాకు బాధగా ఉంది కానీ సినిమాపై డబ్బు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లను గౌరవించాలి.  అందుకే వాయిదా వేస్తున్నాం. సినిమా విడుదలలో జాప్యం జరిగినందుకు అందరికీ క్షమాపణలు" అని మెసేజ్ పెట్టాడు.


Tags:    
  • Hero Nikhil 
  • Arjun Suravaram 
  • lavanya Tripathi 
  • telugu News 
  • Latest updates 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS