మీ విజన్ తో రాష్ట్రాన్ని నడపండి.. సీఎం జగన్ కు హీరో మహేష్ బర్త్ డే విషెస్..

Update: 2020-12-21 09:10 GMT
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  రాజకీయ, సినీ ప్రముఖులు జగన్‌కు విషెస్ చెబుతుండడంతో  ఉదయం నుంచీ.. ఏపీ సీఎంపై ట్వీట్ల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్టు చేశారు.

‘సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్, కృషితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పురోగమిస్తుంది. మీరు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

మహేష్ బాబు ట్వీట్‌తో అటు మహేష్ బాబు అభిమానులతో పాటు.. ఇటు జగన్ ఫ్యాన్స్ సైతం పండగ చేసుకుంటున్నారు. ‘ఈ క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా’మని కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. ‘మహేష్ సూపర్ స్టార్... జగన్ పొలిటికల్ స్టార్’ అంటూ ఓ నెటిజన్ ఫోటోను షేర్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం జగన్‌కు విషెస్ తెలిపారు.

మరోవైపు ఏపీలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇది 48వ పుట్టిన రోజు వేడుక. వైఎస్ జగన్ అభిమానులు, వైసీసీ కార్యకర్తలు రాష్ట్రంలోని పలుచోట్ల ఆయన జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. భాకరపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా 48 కేజీల భారీ కేక్‌ను వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి కట్‌ చేశారు.
Tags:    

Similar News