ఘట్టమనేని వారసుడి డెబ్యూ టీజర్.. యాక్టింగ్ ఎలా ఉందంటే..

ప్రముఖ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.;

Update: 2026-04-15 18:55 GMT

ప్రముఖ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. దివంగత నటుడు కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. తాజాగా ఆ సినిమా టీజర్ విడుదలై సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో ఆకట్టుకుంటూ ఫుల్ వైరల్ అవుతోంది.




తన అన్న కొడుకు నటిస్తున్న డెబ్యూ మూవీ టీజర్‌ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయడం విశేషం. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఆ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగనున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. టీజర్ చూస్తుంటే కథ ప్రధానంగా హీరో శ్రీనివాస్ (జయకృష్ణ), మంగ (రాషా తడానీ) మధ్య సాగే ప్రేమకథ చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది.

సాదాసీదా ప్రేమకథగా మొదలై, తర్వాత తీవ్రమైన ఘర్షణలకు దారితీసే విధంగా కథ మలుపులు తిరుగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఎదుర్కొనే సవాళ్లు, ఆమె కుటుంబంతో జరిగిన ఘర్షణలు కథలో ప్రధానంగా ఉండనున్నాయి. అయితే జయకృష్ణ నటన టీజర్‌ లో ఆకట్టుకునేలా ఉంది. మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా డెబ్యూ హీరోగా అనిపించకుండా తన ఎక్స్ప్రెషన్స్ తో మెప్పించారని చెప్పాలి.

యాక్షన్ సీన్స్‌ లోనూ, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన టాలెంట్ తో ఆకట్టుకున్నారు జయకృష్ణ. మరోవైపు హీరోయిన్‌ గా పరిచయం అవుతున్న రాషా తడానీ కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌ తో ఆకట్టుకుంది. ఆమె ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె కావడం విశేషం. ఇక సినిమాలో విలన్ పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు కనిపించనున్నారు. టీజర్‌ లో ఆయన ఎంట్రీ పవర్‌ ఫుల్‌ గా ఉండి సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

అలాగే సీనియర్ నటుడు నరేష్, నటుడు బ్రహ్మాజీ సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతిక విభాగం కూడా సినిమాకు ప్రధాన బలం కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్న బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ టీజర్‌ కు హైలెట్‌ గా నిలిచింది. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో సినిమా క్వాలిటీపై మంచి నమ్మకం కలుగుతోంది.

నిర్మాణ విషయానికి వస్తే.. శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా శ్రీనివాస మంగాపురం టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది. లవ్, ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ సినిమా ద్వారా జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో.. శ్రీనివాస మంగాపురం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News