మహేష్ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవే...!

Update: 2020-08-07 06:50 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆగస్టు 9 పండగ రోజు అని చెప్పాలి. ఆ రోజున మహేష్ 44 ఏళ్ళు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే మహేశ్ అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసారు. బర్త్ డే కామన్ డీపీని నేషనల్ వైడ్ ట్రెండ్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసారు. ఈ క్రమంలో తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ వేడుకలు జరుపొద్దని.. దేశంలో కరోనా విజృంభిస్తోన్నందున అందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని మహేష్ తన ఫ్యాన్స్ ని కోరారు. దీంతో ఈ ఏడాది సోషల్ మీడియాలోనే మహేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మహేష్ బర్త్ డే ట్రెండ్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం 63 మిలియన్ ట్వీట్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

కాగా మహేశ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. మహేష్ - పరశురామ్ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' మూవీ నుంచి మహేష్ వాయిస్ మెసేజ్ మరియు టైటిల్ ట్రాక్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే మహేశ్ ఓ మైక్ ముందు కూర్చున్న స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ 'రెడీగా ఉన్నారా' అంటూ ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు అభిమానులకు 'సర్కారు వారి పాట' టీమ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ను ఇవ్వనున్నారని స్పష్టమైంది. అంతేకాకుండా 'సర్కారు వారి పాట' నుంచి మరో పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు సూపర్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది ఫ్యాన్స్ మహేష్ సెలెబ్రేషన్స్ కి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News