సింగిల్ క్యారెక్టర్ తో సూపర్ సస్పెన్స్

Update: 2023-04-17 18:52 GMT

అప్పుడప్పుడు ఇండస్ట్రీలో ప్రయోజాత్మక సినిమాలు వస్తూ ఉంటాయి. అలాంటి మూవీస్ లలో కొన్ని ప్రజాదరణ పొందినవి కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రయోజాలు చేయడానికి దర్శకులు అస్సలు సాహసించరు. కొత్త దర్శకులు అయితే చాలా మంది ప్రయోగాల జోలికి వెళ్లరు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో హలో మీరా అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి వస్తోంది.

ఈ మూవీ కేవలం ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కించడం విశేషం.కాకర్ల శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. గార్గేయ ఎర్లగడ్డ ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంటోంది. మరో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకున్న ఒక అమ్మాయి షాపింగ్ కి వచ్చి తిరిగి కారులో ఇంటికి వెళ్తోంది.

ఈ మధ్యలో జరిగే సంఘర్షణల సమాహారంగా ఈ మూవీ కథాంశం ఉండబోతోంది అని ట్రైలర్ తో ప్రెజెంట్ చేశారు. బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయ్యి పెళ్లి రెడీ అయిన మీరా కాబోయే వాడితో కబుర్లు చెబుతోంది. ఇంతలో ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేసాడనే విషయం పోలీసుల నుంచి తెలుసుకుంటుంది. సూసైడ్ లెటర్ లో మీ పేరు రాసారంటూ పోలీసులు చెబుతారు.

పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుందని అంటారు. ఇక ఆ విషయం కాబోయే పెళ్లి కొడుక్కి కూడా తెలిసిపోవడంతో అతను అవమానిస్తాడు. ఇన్ని సంఘర్షణల మధ్య మీరా ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది.

ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీకి ప్రేక్షకుల ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. ప్రయోగాత్మకంగా కమర్షియల్ ఎలిమెంట్స్ లోనే తెరకెక్కించిన చిత్రంగా హలో మీరా ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇక హలో మీరా రిలీజ్ అయ్యే సమయంలోనే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీ కూడా రాబోతూ ఉండటం విశేషం. మరి ఈ రెండింటిలో ప్రేక్షకుడి ఓటు దేనికి ఉంటుందనేది చూడాలి.


Full View

Similar News