ఊరించి ఉసూరుమనిపించిన సూపర్ స్టార్స్ మల్టీస్టారర్...!
ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా అనౌన్స్మెంట్ వీడియోను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది.;
సాధారణంగా ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఒక స్టార్ హీరో, ఒక మీడియం రేంజ్ హీరో కలిసి నటించినా కూడా ఆ సినిమాకు మంచి బజ్ క్రియేట్ కావడం చాలా కామన్ విషయం. అలాంటిది ఇద్దరు సీనియర్ సూపర్ స్టార్స్ ఒకే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా... ప్రేక్షకులు, ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మొత్తం ఇండస్ట్రీ అంతా అటు వైపు చూడకుండా ఉంటుందా.. ఇప్పుడు అంతా కూడా సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ కలిసి నటించబోతున్న సినిమా వైపు చూస్తున్న విషయం తెల్సిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాను మొదలు పెట్టాలి అనుకున్నారు. కానీ కూలీ ఫలితం కారణంగా ఆయన స్థానంలో నెల్సన్ దిలీప్ వచ్చి చేరిన విషయం తెల్సిందే. ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా అనౌన్స్మెంట్ వీడియోను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది.
జైలర్ 2 సినిమా తర్వాత....
రజనీకాంత్, కమల్ హాసన్‌ల స్టార్‌డంతో పాటు, వారి స్వాగ్, వారి స్టైల్‌లతో సినిమా మరో రేంజ్‌లో ఉండటం ఖాయం అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల సినిమా ప్రకటించినప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు సినిమా గురించి వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమా విడుదల ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. కానీ తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నెల్సన్ దిలీప్ ప్రస్తుతం చేస్తున్న జైలర్ 2 సినిమా పూర్తి చేస్తే కానీ ఈ మల్టీస్టారర్ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం లేదు. అంటే సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 2026 చివర్లో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్...
ఈ భారీ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తారట. ఇద్దరికి సమానమైన యాక్షన్, ఎమోషనల్, డ్రామా సీన్స్ ను దర్శకుడు రాసుకుంటాడని, ఇద్దరి కాంబో సీన్స్ ఎక్కువగా ఉంటాయనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా అదుగో ఇదుగో అంటూ ఊరించి చివరకు ఇప్పట్లో రాదు అన్నట్లుగా మారి పోయింది. షూటింగ్ ప్రారంభంకు ఇంకా చాలా సమయం ఉంది. అంటే విడుదలకు కనీసం ఏడాది సమయం పడుతుంది. అదే నిజం అయితే 2027 చివరి వరకు సినిమా కోసం వెయిట్ చేయక తప్పదు. ఇప్పటికే సినిమా స్టోరీ లైన్ రెడీగా ఉంది. స్క్రిప్ట్ వర్క్ ఒక వైపు నడుస్తూనే ఉంది. అయినా కూడా ఇద్దరు హీరోలను కన్విన్స్ చేసే విధంగా స్క్రిప్ట్ రావాలి అంటే చాలా సమయం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ప్రారంభం కాకపోవచ్చు.
2027 చివర్లో ఈ మల్టీస్టారర్...
2027 చివర్లో సినిమా విడుదల కావచ్చని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు. ఒక వేళ ఇద్దరు హీరోల డేట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తితే విడుదల తేదీ మరికొన్ని నెలలు వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదు. అంటే 2028 వరకు సినిమా విడుదల కోసం వేచి చూడాల్సి రావచ్చు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్స్ యొక్క మల్టీస్టారర్ అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేల ఇప్పట్లో విడుదల లేదు అంటూ వస్తున్న వార్తలు వారికి ఉసూరుమనిపించే విధంగా ఉన్నాయి. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదల అయ్యే వరకు కొత్త సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి. మరో వైపు కమల్ హాసన్ కూడా బిజీ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీగా ఉన్న ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకేసారి డేట్లు కేటాయించి, షూటింగ్ కు హాజరు కావాలంటే కాస్త సమయం పడుతుంది, అంతే కాకుండా షూటింగ్ పూర్తి చేయడానికి రెగ్యులర్ సినిమాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ఈ మల్టీస్టారర్ అనుకున్నంత త్వరగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.