విజ‌య్‌, త్రిష రూమ‌ర్స్‌పై బాలీవుడ్ డైరెక్ట‌ర్ కౌంట‌ర్‌!

విజ‌య్‌, త్రిష వివాదంపై బాలీవుడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ భ‌ట్ తాజాగా సోష‌ల్ మీడియా ఇన్‌స్టా వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేసి షాక్ ఇచ్చాడు.;

Update: 2026-03-10 05:51 GMT

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత‌ విజ‌య్‌, త్రిష‌ల వివాదం నెట్టింట వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. త‌మిళ‌నాట దీనిపై పెద్ద ర‌చ్చే జరుగుతోంది. విజ‌య్ అభిమానుల్లో కొంత మంది త్రిష‌కు స‌పోర్ట్ చేస్తుండ‌గా, మ‌రి కొంత మంది మాత్రం త‌ను ఇంత‌కు ముందు ఎంతో మందితో ల‌వ్‌లో ఉంద‌ని, శింబు, రానా.. వంటి త‌దిత‌ర‌లు ఫొటోల‌ని పోస్ట్ చేస్తూ కామెంట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా త్రిష‌, విజ‌య్ వివాదంపై ప‌రోక్షంగా స్పందించి అడ్డంగా బుక్క‌య్యాడు డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ పార్దీబ‌న్‌. ఆ త‌రువాత భారీ స్థాయిలో ట్రోలింగ్‌తో పాటు త్రిష నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వ‌డంతో చేసిన త‌ప్పుకు ఫిల‌య్యారు.

త్రిష‌కు సారీ కూడా చెప్ప‌డంతో వివాదం స‌ద్దుమ‌నిగింది. అయితే ఈ వివాదం ఇంకా కొన‌సాగేలా క‌నిపిస్తోంది. ఎందుకంటే కోలీవుడ్ నుంచి ఇప్పుడు ఈ వివాదం బాలీవుడ్‌కు చేరింది. విజ‌య్‌, త్రిష వివాదంపై బాలీవుడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ భ‌ట్ తాజాగా సోష‌ల్ మీడియా ఇన్‌స్టా వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేసి షాక్ ఇచ్చాడు. ఇటీవ‌ల విజ‌య్‌, త్రిష‌ల‌పై వివాదం నెట్టింట వైర‌ల్ అవుతున్న వేళ త్రిష‌తో క‌లిసి విజ‌య్ చైన్నైలో జ‌రిగిన ఓ వివాహ వేడుక‌లో పాల్గొన‌డం తెలిసింది. ఇక్క‌డి నుంచే వీరిద్ద‌రిపై నెట్టింట ప్ర‌చారం జోరందుకుంది.

తాజాగా ఈ ప్ర‌చారంపై బాలీవుడ్ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. సినీ తార‌ల‌కు సంబంధించి వారు న‌టించిన సినిమాల గురించి మాత్ర‌మే మాట్లాడాల‌ని వారి వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడే అర్హ‌త ఎవ‌రికీ లేద‌న్నారు. అంతే కాకుండా విజ‌య్‌, త్రిష‌ల గురించి ఆస‌క్తికరంగా స్పందించారు. `విజ‌య్‌, త్రిషల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి చాలా చ‌ర్చ జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న రూమ‌ర్స్ నిజ‌మో కాదో నాకు తెలియ‌దు. ఒక‌వేళ అవి నిజ‌మైతే నేను కొన్ని విష‌యాల‌ను చెప్పాల‌నుకుంటున్నాను.

వారిద్ద‌రూ ఎంతో హుందాగా ఉంటున్నారు. వారు ఏ విష‌యాన్ని దాచిపెట్ట‌డం లేదు. ఇప్పుడు వాళ్ల‌ను ఎంతో మంది జ‌డ్జ్ చేస్తున్నారు. వారి గురించి మాట్లాడే వాళ్లంతా ఒక్క‌సారి వాళ్ల‌ని వాళ్లు ప్ర‌శ్నించుకోవాలి. న‌టీన‌టుల సినిమాలు మాత్ర‌మే మ‌న‌వి. వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితాలు మాత్రం మ‌న‌వి కాదు` అంటూ విక్ర‌మ్ భ‌ట్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే కొంత మంది విక్ర‌మ్ భ‌ట్‌ని స‌మ‌ర్ధిస్తుంటే కొంత మంది మాత్రం ఏమీ తెలియ‌కుండా మీరు ఎందుకు ఇలా స్పందిస్తున్నారు అంటూ చుర‌క‌లు అంటిస్తున్నారు.

మీరు తెలుసుకోవాల్సిన విష‌యం ఒక‌టి ఉంది. అత‌నికి పెళ్లైన ఒక స్త్రీ. జ‌రుగుతున్న దాని తీవ్ర‌త‌ను గ్ర‌హించే వ‌య‌సులో ఉన్న‌ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. న‌చ్చిన వివాహం చేసుకున్న త‌న భాగ‌స్వామికి త‌గిన ప‌రిహారం ఇచ్చిన త‌రువాత పురుషుల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చే హ‌క్కు ఉంది. కానీ అలా చేయ‌కుండా, వారి భావాల‌ను లెక్క‌చేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం నాకు న‌చ్చ‌లేదు. నేను విజ‌య్‌, త్రిష‌ల‌ని ఆరాధించే వ్య‌క్తినే కానీ ఈ విష‌యంలో మాత్రం వారిని స‌మ‌ర్ధించ‌లేను` అంటూ ఓ నెటిజ‌న్ పెట్టిన కౌంట‌ర్‌ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.



Tags:    

Similar News