విజ‌య్‌పై తిరుగుబాటు..నిల‌దీసీన నేత‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ప్ర‌స్తుతం నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు. సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి ఆయ‌న క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-03-10 04:57 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ప్ర‌స్తుతం నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు. సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి ఆయ‌న క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్న విష‌యం తెలిసిందే. టీవీకే పేరుతో ఇప్ప‌టికే పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచే విజ‌య్ నిత్యం ఏదో ఒక ఇష్యూ కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తుండ‌టం ఈ మ‌ధ్య కామ‌న్‌గా మారింది. సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టే క్ర‌మంలో ఆయ‌న న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌` కూడా వివాదంలో చిక్కుకోవ‌డం, దాని కోసం మేక‌ర్స్ మ‌ద్రాస్ హైకోర్టులో పిటీష‌న్ వేయ‌డం.. ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కేసు విత్‌డ్రా చేసుకోవడం జ‌రిగింది.

జ‌న‌వ‌రి 9న రిలీజ్ కావాల్సిన సినిమా సెన్సార్ వివాదం కార‌ణంగా రివైజింగ్ క‌మిటి ముందుకు వెళ్లింది. దీనిపై క‌మిటీ నిర్ణ‌యం ఫైన‌ల్ కాబోతోంది. తుది నిర్ణ‌యం ప్ర‌క‌టించి సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేస్తేనే `జ‌న నాయ‌గన్` రిలీజ్ అవుతుంది. అంత వ‌ర‌కు మేక‌ర్స్‌తో పాటు విజ‌య్‌, అభిమానులు, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉంటే విజ‌య్ చుట్టూ వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో పాటు పార్టీ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఒక‌దాని త‌రువాత ఒక‌టి క‌ల‌వ‌ర‌పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

సీబీఐ కేసు, విచార‌ణ ఓ వైపు, వైఫ్ సంగీత విడాకులు కోరుతూ చెంగ‌ల్‌ప‌ట్టు ఫ్యామిలీ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేయ‌డం మ‌రో వైపు.. త్రిష‌తో ఎఫైర్ ఉందంటూ వ‌రుస క‌థ‌నాలు మొద‌లు కావ‌డం, వాటిని నిజం చేస్తూ విజ‌య్ ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన ఓ వివాహ వేడుక‌లో త్రిష‌తో క‌లిసి క‌నిపించి షాక్ ఇవ్వ‌డం వంటి కార‌ణాల‌తో విజ‌య్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా త‌న‌ని చుట్టుముడుతున్న స‌మ‌స్య‌ల‌పై విజ‌య్ ప‌రోక్షంగా స్పందించి వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌ని లేద‌ని, అవి అంత వ‌ర్త్ కాద‌ని కామెంట్ చేయ‌డం షాక్‌కు గురి చేసింది.

విజ‌య్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై సొంత పార్టీ నేత నుంచే తిరుగుబాటు మొద‌లైంది. టీవీకే పార్టీ నాయ‌కురాలు రంజ‌నా నాచ్చియార్ పార్టీ అధినేత విజ‌య్‌పై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు. త‌న భార్య విడాకులు కోరిన వ్య‌వ‌హారంపై టీవీకే అధ్య‌క్షుడు విజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆ పార్టీ నాయ‌కురాలు రంజ‌నా నాచ్చియార్ స్పందించారు. మ‌హిళ‌ల గౌర‌వాన్ని కాపాడే భాష మీ మాట‌ల్లో క‌నిపించ‌క‌పోతే ఇక ఆ రాజ‌కీయం ఎందుక‌ని, మీ నిజ‌స్వ‌రూపం ఏమిట‌ని ఆమె విజ‌య్‌ని ప్ర‌శ్నించ‌డం ఇప్పుడు త‌మిళ‌నాట క‌ల‌క‌లం రేపుతోంది.

ఆమె త‌న ప్ర‌క‌ట‌న‌లో విజ‌య్‌ని ఉద్దేశించి.. మ‌హిళా దినోత్స‌వంలో మీకు, మీ భార్య‌కు మ‌ధ్య‌ ఉన్న స‌మ‌స్య‌ను ప్ర‌స్తావిస్తూ `అది వ‌ర్త్ కాదు` అన్నారు. వ‌ర్త్ కానిది మీ భార్య‌నా? లేక మీ వైవాహిక జీవిత‌మా? అని ప్ర‌శ్నించారు. రాజ‌కీయ నాయ‌కుడు మాట్లాడే ప్ర‌తి మాట ఒక కుటుంబంలో మాత్ర‌మే కాక స‌మాజంలో ప్ర‌తిధ్వ‌నిస్తుంద‌ని రంజ‌న తెలిపారు. భార్య‌ను ఇంట్లోకి అనుమ‌తించ‌కుండా ఒక్కో కుటుంబానికి ఆరు గ్యాస్‌ సిలిండ‌ర్లు ఇస్తాన‌ని చెప్ప‌డం వైరుధ్యంగా లేదా? అన్నారు. ఓ న‌టిని వెంట‌బెట్టుకుని బ‌హిరంగ ప్రాంతానికి వ‌స్తే పెళ్లైన త‌రువాత మ‌న‌మూ ఇలాగే జీవిద్దామ‌నే ఆలోచ‌న యువ‌త‌లో నాటుకుపోదా? అని విజ‌య్‌ని నిల‌దీశారు.

పుట్టే ప్ర‌తి బిడ్డ‌కు మేన మామ‌గా సారే ఇస్తాన‌ని చెప్ప‌డం మంచి ఉద్దేశ‌మే అదే స‌మ‌యంలో సొంత బిడ్డ‌కు తండ్రిగా ఉండ‌టం కూడా ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర యువ‌త‌కు మీరు ఆద‌ర్శంగా ఉండాలి` అన్నారు. ప్ర‌స్తుతం రంజ‌నా నాచ్చియార్ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం సృష్టిస్తూ వైర‌ల్‌గా మారింది. సొంత పార్టీ నాయ‌కురాలే ఇలా నిల‌దీసి తిరుగుబాటు చేయ‌డంతో విజ‌య్ ఎలాంటి స‌మాధానం చెబుతాడా? అని అంతా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News