రజనీ కోసం నెల్సన్ మాస్టర్ ప్లాన్.. జైలర్ 2లో షారుఖ్ పాత్ర ఏంటంటే?
సౌత్ సినీ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొల్పిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తున్నజైలర్2 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.;
సౌత్ సినీ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొల్పిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తున్నజైలర్2 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై మొదటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది. 2023లో రిలీజైన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో దాని సీక్వెల్‌పై అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా తాజా అప్డేట్లు సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
జైలర్ లో ఎన్నో సర్ప్రైజ్ ఎలిమెంట్స్
ఈ సీక్వెల్ సినిమాను డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ముందు సినిమా కంటే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి భాగంలోనే అనేక సర్ప్రైజ్ ఎలిమెంట్స్, పలు క్యామియోలతో ప్రేక్షకులను అలరించిన నెల్సన్, ఈసారి కూడా అదే ఫార్ములాను మరింత భారీ స్థాయిలో ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కథలో కీలకమైన మలుపుల కోసం స్టార్ యాక్టర్ల కామియో పాత్రలను ఉపయోగించడం ద్వారా సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణ తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
జైలర్2 లో షారుఖ్ ఖాన్ క్యామియో
అందులో భాగంగానే ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా ఒక కీలక కామియో పాత్రలో కనిపించనున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా షారుఖ్ ఈ సినిమాలో కనిపిస్తారనే ప్రచారం కొనసాగుతున్నప్పటికీ, తాజాగా ఆయన పాత్రపై మరింత స్పష్టత వస్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఎస్.జె సూర్యతో కలిసి ఉండనున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.
క్యామియోలతో హైప్ పెరిగే ఛాన్స్
ప్రస్తుతం భారీ సినిమాల్లో స్టార్ కామియోలు ఒక ట్రెండ్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. కథకు కీలకమైన మలుపుల్లో పెద్ద స్టార్‌లను చూపించడం ద్వారా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయడంతో పాటూ, స్టార్ హీరోలు భాగమైనప్పుడు సినిమాపై హైప్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్లు ఎక్కువగా ఈ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఇదే ట్రెండ్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ కూడా తనదైన స్టైల్‌లో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద స్టార్‌లను తమ సినిమాల్లో భాగం చేసి, వారిని ఎలివేట్ చేసే క్యారెక్టర్లలో చూపించడం ద్వారా థియేటర్లలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చే అవకాశముంటుంది.
రజనీ- షారుఖ్ సీన్స్ పై ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్
ఆల్రెడీ జైలర్2 విషయంలో ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉండగా, మరో వైపు రజినీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్‌లు ఒకే సినిమాలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. నార్త్ మరియు సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులను ఒకేసారి ఆకర్షించేలా ఈ కాంబినేషన్ ఉండబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న జైలర్2లో సర్ప్రైజ్ కామియోలు, స్టార్ కాంబినేషన్లు, డైరెక్టర్ నెల్సన్ స్పెషల్ ప్లానింగ్.. అన్నీ కలిసి సినిమాపై ఉన్న క్రేజ్ ను మరింత పెంచుతున్నాయి. సినిమా రిలీజయ్యాక టాక్ కూడా బాగా వస్తే, ఈ సీక్వెల్ కూడా మొదటి భాగం తరహాలోనే బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.