సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు: బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్

Update: 2021-10-19 17:30 GMT
బిగ్ బాస్ సీజన్ 9 ఫేమ్ యువికా చౌదరిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది.. షెడ్యూల్ కులాలను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆమెను సోమవారం అరెస్ట్ చేశారు. యువికా చౌదరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాకుండా సినీ పరిశ్రమ వర్గాల్లో కూడా చర్చనీయాంశమయ్యాయి.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువికా చౌదరీ వర్ధమాన నటిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ నటించిన ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ తో ఓం శాంతి ఓం సినిమాలోనూ నటించింది. ఆ తర్వాత యారానా, వీరేయ్ కి వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించింది.

యువికా చౌదరి మలేయాలి జోతేయాలి అనే కన్నడ చిత్రంలో హీరో గణేష్ సరసన కూడా నటించారు. టెలివిజన్ రంగంలో ఎంటీవీ స్ల్పిట్ విల్లా 10, నాచ్ బిలియే 9, పలు షోలలో నటించారు.

ఇటీవల దళితులను టార్గెట్ చేస్తూ యువికా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 2021 మేలో యువికాపై దళిత్ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుతో ఆమెను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువికా చౌదరీ దంపతులు ఎస్సీలపై విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి.

భర్త ప్రిన్స్ నరులాతో కలిసి దళితులను కించపరిచే విధంగా వీడియోను చిత్రీకరించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ కావడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దళితులకు క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

అక్టోబర్ 18వ తేదీన మరోసారి దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో యువికా చౌదరి పోస్టు పెట్టింది. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేశారు. యువికా తీరుపై ఇప్పటికే దళితులు, సామాజిక కార్యకర్తలు భగ్గుమని ఆందోళన చేశారు.

ఇక తన అరెస్ట్ పై యువికా స్పందించింది. కేసు దర్యాప్తు జరుగుతోందని.. తాత్కాలిక బెయిల్ లభించిందని.. అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చింది. ఎస్సీల మనోభావాలు దెబ్బతీయలేదన్నారు.


Tags:    

Similar News