దిశా ఎన్ కౌంటర్ ను ట్రెండింగ్ చేయండి

Update: 2019-12-06 07:00 GMT
హైదరాబాద్ లో జరిగిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు సపోర్టు చేస్తున్నారు.

తాజాగా దిశ ఎన్ కౌంటర్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీపీ సజ్జనార్ పదికాలాల పాటు చల్లగా ఉండాలంటూ కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ ‘మా సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు పట్టించుకోకపోయినా పర్లేదు. కానీ దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ వవార్తను విస్తృతంగా ప్రచారం చేయండి.. సోషల్ మీడియాలో, మీడియాలో ట్రెండింగ్ చేయండి.. అందరికీ తెలిసేలా చాటింపు వేయండి’ అని అభిమానుల కోరారు.
Tags:    

Similar News