అమితాబ్ మ‌న‌వ‌డితో సుహానా బ్రేక‌ప్?

ఆ ఇద్ద‌రూ జంట‌గా షికార్ చేసిన వీడియోలు కూడా వైర‌ల్ అయ్మాయి.

Update: 2024-05-05 12:30 GMT

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌డు అగస్త్య నందాతో కింగ్ ఖాన్ షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్ డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు ఉన్నాయి. ఆ ఇద్ద‌రూ ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో న‌ట‌నారంగేట్రం చేసే క్ర‌మంలో సెట్స్ లో ఉన్న‌ప్పుడు ఒక‌రికొక‌రు ఆక‌ర్షితుల‌య్యార‌ని, క‌లిసి ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నార‌ని పుకార్లు మొద‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత ఇది ప్రేమ‌గా మారింద‌ని హిందీ మీడియాలు క‌థ‌నాలు అల్లాయి. ఆ ఇద్ద‌రూ జంట‌గా షికార్ చేసిన వీడియోలు కూడా వైర‌ల్ అయ్మాయి.

అదంతా అటుంచితే సుహానా ఖాన్ శుక్రవారం మధ్యాహ్నం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో విడిపోయినట్లు వెల్లడించింది. ``నాపై ఒక న్యూస్ ఉంది! నేను విడిపోయాను`` అని ప్ర‌క‌టించింది. ఈ ఊహించ‌ని ప్ర‌క‌ట‌న‌తో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న వెన‌క ట్విస్టు ఉంది. ఇది కేవ‌లం ఒక అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ క్యాంపెయిన్ మాత్ర‌మే. సుహానా ఎంతో తెలివిగా టైమింగ్ లీ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. అది కూడా తన తాజా వాణిజ్య ప్రకటనకు సంబంధించిన‌ ప్ర‌చారంలో బిజీగా ఉంది. అయితే సుహానా తన బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడటం లేదని వీడియో చూశాక క్లారిటీ వ‌చ్చింది. ఇప్పుడు తన సబ్బును మార్చిందని అర్థం చేసుకోవాలి. సుహానా లక్స్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందన్న‌మాట‌. ల‌క్స్ బాడీ వాష్ కి ప్ర‌చారం చేస్తోంది. ఈ సరదా వీడియో అదే విషయాన్ని ప్రకటించింది.

Read more!

సుహానా ఖాన్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన సమయంలో ఈ వీడియో వచ్చింది. ఆసక్తికరంగా, అగస్త్య తల్లి శ్వేతా బచ్చన్ నందా కూడా సుహానా వీడియోపై స్పందించారు. వ్యాఖ్యల విభాగంలో పింక్ రిబ్బన్ ఎమోజీని షేర్ చేసారు.

సుహానా -అగస్త్యల డేటింగ్ పుకార్లు చాలా కాలంగా హెడ్ లైన్స్ లోకొస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో జోయా అక్తర్ `ది ఆర్చీస్‌`తో ఇద్దరూ తమ నటనను ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ల సమయంలో, ది ఆర్చీస్‌లో జగ్‌హెడ్ పాత్రను పోషించిన మిహిర్ అహుజాను సుహానా - అగస్త్య డేటింగ్ పుకార్ల గురించి అడిగారు. ``నిజాయితీగా, వారు డేటింగ్ చేస్తున్నారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు``అని యువ నటుడు జూమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చెప్పాడు. ది ఆర్చీస్ తారల ల‌వ్ లైఫ్ చర్చ‌ల్లోకొస్తున్నందుకు తాను బాధపడలేదని అన్నాడు. వారికి దానిపై శ్రద్ధ ఉందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు... కానీ ఇది బాగుంది అని నేను అనుకుంటున్నాను. దీనికి చింతించను. మీడియా త‌మ‌ పనిని చేస్తోంది`` అని అన్నాడు.

సుహానా ఖాన్ త్వరలో తండ్రి షారూఖ్ ఖాన్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. కింగ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. పఠాన్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ కూడా ఈ సినిమాలో యాక్షన్‌ను పర్యవేక్షించనున్నారు. తండ్రీకూతుళ్లు ఈ సినిమా షూటింగ్‌ను లండన్‌లో ప్రారంభిస్తార‌ని సమాచారం. ఇటీవల కింగ్ టీమ్ లండన్‌లో తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుందని సమాచారం. నిర్మాణ బృందం భారీ ప్ర‌ణాళికలను కలిగి ఉంది. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

4
Tags:    

Similar News