• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ఒక్కటి అడక్కు.. 2వ రోజు...

ఆ ఒక్కటి అడక్కు.. 2వ రోజు ఎంత వచ్చాయంటే..

| ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

By - Tupaki Desk
Update: 2024-05-05 09:50 GMT

కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అల్లరి నరేష్ ఇటీవల ప్రయోగాత్మకమైన సీరియస్ కథలను కూడా టచ్ చేస్తున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత అతని నుంచి ఫుల్ లెన్త్ కామెడీ డ్రామాగా ఆ ఒక్కటి అడక్కు సినిమా ఈ వారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మల్లి అంకం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను, రాజీవ్ చిలక, చిలక ప్రొడక్షన్స్ పై నిర్మించారు.

కామెడీ అంశాలతో పాటు ఈ సినిమాలలో ఉన్న సామాజిక అంశాలను కూడా దర్శకుడు తనదైన శైలిలో ప్రజెంట్ చేశాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే తరహాలో రాబట్టింది. పోటీగా కూడా పెద్ద సినిమాలు లేకపోవడం బాగా కలిసి వచ్చింది.

చిలకా ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రం రెండవ రోజు 1.72 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో మొత్తంగా రూ. 3.34 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఆ ఒక్కటి అడక్కు సినిమా ఈ తరహాలో కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరు ఉహించలేదు. మొదటి రోజు సంపాదనతో పోలిస్తే, రెండో రోజు బలమైన బిజినెస్ చేయడం నిజంగా అరుదైన విషయం.

ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను సినిమాలో అల్లరి నరేష్ కామెడీ తో పాటు ఫారియా అబ్దుల్లా నటన కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఒక్కటి అడక్కు సమ్మర్ లో ఇంకా మంచి కలెక్షన్లు అందుకునే ఆవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. పెళ్లి కాని యువకుడిగా కనిపించిన అల్లరి నరేష్ ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోని స్థిరపడాలి అనుకుంటాడు.

నేటితరం యువతరం ఎదుర్కొంటున్న ఒక డిఫరెంట్ అంశంతో ఈ సినిమా రూపొందింది. అయితే ఎంత ప్రయత్నం చేసినా అతనికి పెళ్లి కాకపోవడంతో మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తాడు. అనంతరం అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? ఇక ఫారియా అతని జీవితంలో కి ఎలా వచ్చింది అనే అంశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

ఇక అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో వెన్నెల కిషోర్ వైవా హర్ష షకలక శంకర్ లాంటి కమెడియన్స్ ప్రత్యేకమైన పాత్రలలో నటించారు. ఇక మరోవైపు నరేష్ మరిన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక సీరియస్ డ్రామాకు కూడా ఒకే చెప్పినట్లు టాక్.

Tags:    
  • Tollywood 
  • BoxOfiice 
  • Collections 
  • AaOkkatiAdakku 
  • AllariNaresh 
  • MalliAnkam 
  • RajivChilaka 
  • ChilakaProductions 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS