వెకేషన్ లో మెగా కపుల్.. సో స్వీట్!

ఆ వేడుకకు టాలీవుడ్‌ కు చెందిన పలువురు సినీ దర్శకులు, నిర్మాతలు, నటులు వచ్చి కపుల్ ను ఆశీర్వదించారు.

Update: 2024-05-05 11:30 GMT

మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటలీలో వీరిద్దరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. వరుణ్, లావణ్యల పెళ్లికి ఇరువైపుల నుంచి కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు టాలీవుడ్‌ కు చెందిన పలువురు సినీ దర్శకులు, నిర్మాతలు, నటులు వచ్చి కపుల్ ను ఆశీర్వదించారు.


ప్రస్తుతం వరుణ్, లావణ్య హ్యాపీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్స్, ఫ్యామిలీ ట్రిప్స్ కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత తమ సినిమాల వర్క్స్ ను కంప్లీట్ చేశారు. వివాహం అయ్యాక లావణ్య.. మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో పలకరించింది. పులి మేక సినిమాలో కనిపించింది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ చిత్రం అనుకున్నంత స్థాయిలో హిట్ ఇవ్వలేదు.

ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం వరుణ్, లావణ్య కొత్త పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం వీరిద్దరు వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఫారిన్ కంట్రీలో ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా దిగిన పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో లావణ్య, వరుణ్ ఒకరినొకరు చూస్తూ నవ్వుకుంటూ పోజు ఇచ్చారు. సూపర్ బ్యాక్ గ్రౌండ్ లో దిగిన ఫోటో అదిరిపోయిందని, కపుల్ గోల్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Read more!

దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న వరుణ్‌, లావణ్య పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2017లో మిస్టర్ మూవీ కోసం ఫస్ట్ టైమ్ వీరిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. అప్పుడు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఏడాది థియేటర్లలోకి వచ్చిన అంతరిక్షం మూవీలో మరోసారి కలిసి నటించారు. అలా వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. లావణ్య బర్త్ డే రోజు.. లవ్ ప్రపోజల్ చేశారు వరుణ్ తేజ్.

ఆ తర్వాత వరుణ్, లావణ్య.. ఇద్దరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రేమ విషయాన్ని చెప్పారు. అందరూ వారి ప్రేమను అంగీకరించారు. ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా నాగబాబు ఇంట్లో చేసుకున్నారు. అనంతరం నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీలో వీరి వివాహ వేడుక.. సింపుల్ అండ్ స్వీట్ గా జరిగింది. అయితే ఆరేళ్లపాటు ఇద్దరూ లవ్ చేసుకున్నా.. ఎక్కడా ఎవరికీ ఎలాంటి డౌట్ రాకుండా చూసుకున్నారు వరుణ్, లావణ్య!

Tags:    

Similar News