వాళ్ల కళ్లల్లో పడాలని కుమారి ఆశ..!

అమ్మడిని సరిగా వాడుకోవాలే కానీ మరో కుమార్ రేంజ్ సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది.

Update: 2024-05-05 06:13 GMT

అలా ఎలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హెబ్భా పటేల్ సుకుమార్ నిర్మాణంలో చేసిన కుమారి 21F సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా టైం లో యూత్ ఆడియన్స్ కి క్రష్ గా మారింది హెబ్భా పటేల్. కుమారి 21F సూపర్ హిట్ కాగా ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో తడబడ్డది అమ్మడు. ఆ తర్వాత కూడా తన మార్క్ గ్లామర్ షో చేసినా ఎందుకో అవేవి అంతగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ఏళ్లు గడుస్తున్నా హెబ్భా పటేల్ కి ఉన్న ఫాలోయింగ్ అయితే అలానే ఉంది. అమ్మడిని సరిగా వాడుకోవాలే కానీ మరో కుమార్ రేంజ్ సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎందుకో ఆ ప్రయత్నాలు చేయడం కుదరట్లేదు.


కొందరు హీరోయిన్స్ కు వారి కెరీర్ మొదట్లో చేసిన సినిమాల వల్ల వారి కెరీర్ అంతా అదే రకమైన ఇమేజ్ సంపాదించుకుంటారు. హెబ్భా పటేల్ పరిస్థితి కూడా అంతే కుమారి తో వచ్చిన గ్లామర్ ఇమేజ్ తోనే కెరీర్ నెట్టుకొస్తుంది. అయితే ఆ రేంజ్ హిట్ మాత్రం దక్కించుకోలేదు. అవకాశాలు లేని టైం లో వచ్చిన చిన్నా చితకా పాత్రలను కూడా చేస్తూ వచ్చింది అమ్మడు.


అయితే కాస్త కెరీర్ ఫాం తగ్గింది అనుకున్న ప్రతి హీరోయిన్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఫోటో షూట్స్ ని అస్త్రంగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు హీరోయిన్స్ రెచ్చిపోతూ చేసిన ఫోటో షూట్స్ దర్శనమిస్తున్నాయి. అందరిలానే కుమారి హెబ్భా పటేల్ కూడా అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. హెబ్భా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ కుర్రాళ్లకు మళ్లీ కుమారి రోజులను గుర్తు చేస్తుంది.

Read more!

ఇప్పటికి కూడా హెబ్భా గ్లామర్ ఇమేజ్ వాడుకుని మంచి రొమాంటిక్ సినిమా చేస్తే తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 24 కిస్సెస్ లాంటి ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ అవ్వట్లేదు. మరి కుమారి చేస్తున్న ఈ ఫోటో షూట్స్ హంగామా అమ్మడికి అవకాశాలు వచ్చేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం హెబ్భా పటేల్ హనీమూన్ ఎక్స్ ప్రెస్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా లో కూడా హెబ్భా గ్లామర్ నే పెట్టుబడిగా పెట్టేస్తున్నారు మేకర్స్. మరి ఈ హనీమూన్ తో అయినా హెబ్భా తిరిగి ఫాంలోకి వస్తుందేమో చూడాలి

Tags:    

Similar News