• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: వీరమల్లు...

ఫస్ట్ లుక్: వీరమల్లు ప్రేయసి 'పంచమి' గా అందాల నిధి..!

By - Tupaki Desk
Update: 2021-08-17 09:30 GMT
'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన 'మున్నా మైఖేల్' బ్యూటీ నిధి అగర్వాల్.. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన నిధి.. తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పూర్తిగా సౌత్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సరసన ''హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'' చిత్రంలో నిధి హీరోయిన్ గా నటిస్తోంది. నేడు మంగళవారం అందాల గని నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలోని ఆమె పాత్రను చిత్ర యూనిట్ పరిచయం చేశారు.

హిస్టారికల్ కథాంశంతో తెరకెక్కుతోన్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' సినిమాలో నిధి అగర్వాల్ 'పంచమి' అనే పాత్రలో కనిపించనుందని చిత్ర బృందం తెలియజేసారు. ఈ సందర్భంగా నిధి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఇందులో నిండైన చీరకట్టులో ఉన్న నిధి.. ఒంటి నిండా న‌గ‌లు సింగారించుకుని ఓ డ్యాన్స్ పోజ్ లో నిలబడి ఉంది. 'పంచమి' చంద్రుని వలె సొగసైనది మరియు రేడియెంట్ అని చిత్ర బృందం పేర్కొంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన నిధి.. ఇందులో సాంప్రదాయకంగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' సినిమాతో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరే అవకాశం ఉంది. ఇకపోతే మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న ''హీరో'' చిత్రంలో నిధి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు నిధి బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెస్ అందిస్తూ.. స్పెషల్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

కాగా, 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. 17వ శతాబ్దానికి చెంది మొఘల్స్ - కుతుబ్ షాహీల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బందిపోటుగా రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ పాల్ మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌ జేబు పాత్ర‌ను పోషిస్తున్నారు.

ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బెన్ లాక్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా వర్క్ చేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ మూవీకి డైలాగ్స్ రాస్తున్నారు.

'హరి హర వీరమల్లు' పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. అలానే ఫస్ట్ హిస్టారికల్ మూవీ. దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన వీరమల్లు ఫస్ట్ గ్లిమ్స్ విశేష స్పందన తెచ్చుకుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. 45 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే తిరిగి సెట్స్ మీదకు వెళ్లనుంది. 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని 2022 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Tags:    
  • Nidhi Agarwal 
  • Hari Hari Veeramallu 
  • Pawan Kalyan 
  • Tollywood 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS