మల్టీ ట్యాలెంటెడ్‌ నందితాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

Update: 2020-11-07 04:45 GMT
నటిగా.. దర్శకురాలిగా తనకంటై ఒక ప్రత్యేక పంథాను క్రియేట్‌ చేసుకున్న నందితా దాస్‌ ఇప్పటి వరకు పది భాషల్లో ఏకంగా 40 సినిమాలకు పైగా నటించింది. నటిగా విలక్షణమైన గుర్తింపును దక్కించుకున్న ఆమె దర్శకురాలిగా కూడా మెప్పించింది. 2008 సంవత్సరంలో ఫిరాక్‌ సినిమాతో దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయ స్తాయిలో ఆ సినిమాకు గౌరవం దక్కంది. టొరెంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ప్రదర్శణకు వెళ్లిన ఆ సినిమాతో నందితా దాస్‌ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నటిగా వరుసగా విభిన్నమైన పాత్రలు చేసిన ఆమె 2018 సంవత్సరంలో మాంటో అనే సినిమాను చేసింది.

మాంటో సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో స్క్రీనింగ్‌ కు ఎంపిక అయ్యాయి. కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ జ్యూరీ మెంబర్‌ గా వ్యవహరించి అరుదైన గౌరవంను పొందిన నందితా దాస్‌ ఇండియన్‌ సినిమాకు గర్వకారణం అంటూ ఆమె అభిమానులు అంటూ ఉంటారు. పలు ఇంటర్నేషనల్‌ అవార్డులను దక్కించుకున్న ఆమె ప్రస్తుతం తెలుగులో వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా రూపొందుతున్న సినిమా విరాటపర్వం లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఆమె ఈ సినిమాలో నటించడంతో సినిమాకు పాన్‌ ఇండియా గుర్తింపు వచ్చిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేడు నందితా దాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా మా తరపున.. ఆమె అభిమానుల తరపున ఇండస్ట్రీ తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Tags:    

Similar News