• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్: దోస్తులతో చిల్...

పిక్ టాక్: దోస్తులతో చిల్ అవుతున్న నాని..!

By - Tupaki Desk
Update: 2022-08-07 08:34 GMT
'అంటే సుందరానికి' తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ''దసరా''. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఒడెలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

'దసరా' సినిమా కోసం నాని తొలిసారిగా ఊర మాస్ అండ్ రగ్గుడ్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు. ఇందులో అతను తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు. ఈ సినిమా కథంతా పెద్దపల్లి జిల్లాలోని గోదావరరిఖని లోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామంలో సెట్ చేయబడింది.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు 'స్పార్క్ ఆఫ్ దసరా' గ్లింప్స్ కు విశేష స్పందన లభించింది. నాని మాస్ గెటప్ అండ్ రా రస్టిక్ అవతార్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

'ధూమ్ ధామ్ దోస్తాన్‌.. ఇర‌గ మ‌ర‌గ చేద్దాం' అని పేర్కొనబడిన ఈ పోస్టర్ లో నాని తో పాటుగా అతని గ్యాంగ్ మొత్తాన్ని చూడొచ్చు. నాని అండ్ కో రైల్వే పట్టాల మధ్య కూర్చొని చిల్ అవ్వడం కనిపిస్తుంది. చిరునవ్వులు చిందిస్తున్న అందరి ముఖాల్లో సంతోషాన్ని గమనించవచ్చు. అలానే పోస్టర్ లో రానెస్ కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఫ్రెండ్ షిప్ డేకి తగినట్లుగా ఉందని చెప్పాలి.

'దసరా' అనేది నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. అత్యధిక బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నాని సరసన 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని - సాయి కుమార్ - జరీనా వహాబ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్‌ నూలి ఎడిటర్‌ గా.. అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్ చేస్తున్నారు. స్టంట్ డైరెక్టర్స్ అన్బరీవ్ యాక్షన్ పార్ట్ డిజైన్ చేశారు.

'దసరా' చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించనున్నారు.
Tags:    
  • Nani 
  • Dasara 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS