సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ టాక్‌ దక్కించుకున్న 'క్రాక్‌'

Update: 2021-01-02 10:30 GMT
మాస్‌ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్‌ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ట్రైలర్ ను కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయడం జరిగింది. రవితేజను అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో చూస్తారని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ట్రైలర్‌ లో మాస్‌ డైలాగ్స్ యాక్షన్‌ సీన్స్.. తమిళ నటి వరలక్ష్మి.. సముద్రఖనిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్న ట్రైలర్‌ కు యూట్యూబ్‌ లో విపరీతమైన ఆధరణ దక్కింది.

యూట్యూబ్‌ లో 24 గంటలు కూడా గడవకముందే ట్రైలర్‌ 7 మిలియన్‌ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో హడావుడిగా ఉన్న క్రాక్‌ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ట్రైలర్‌ సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు మరియు రవితేజ అభిమానులు ఉన్నారు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అనేందుకు ట్రైలర్‌ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా శృతి హాసన్‌ నటించిన విషయం తెల్సిందే. రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించడంతో పాటు పక్కా మాస్ మసాలా డైలాగ్‌ లు చెప్పడంతో ఈ సంక్రాంతికి రవితేజ సక్సెస్‌ కొట్టడం ఖాయం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News