ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో త్రివిక్రమ్ మూవీ స్టార్ట్!!

Update: 2021-01-02 09:45 GMT
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే రెండో సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'అరవింద సమేత' సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకేక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తైయిన తర్వాత బ్రేకులు లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రాజకీయ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల పై త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని టాక్.

ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్బంగా కలిసిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ తమ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం చేస్తామని తెలిపారు. కానీ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది మాత్రం త్వరలో చెప్తామని అన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందనున్న ఈ అయినను పోయిరావలే హస్తినకు సినిమా త్వరలో మొదలు పెడతామని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ట్విట్టర్ వేదికగా కన్ఫర్మ్ చేసారు. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానులలో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికి విదితమే. ఇక ఈ సినిమా కూడా అలాంటి విజయాన్ని అందుకుంటుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మికను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News