దసరా నుండి టాలీవుడ్ కి మంచి రోజులు.. కారణమిదే!
సంక్రాంతి వెళితే వేసవి ఉందని సంబర పడ్డారు. కానీ ఈసారి వేసవి సీజన్ వృథా అయిపోయింది. మహమ్మారీ రంగ ప్రవేశంతో టాలీవుడ్ అతలాకుతలం అయ్యింది. థియేటర్లు బంద్.. షూటింగుల బంద్ లాంటి అత్యయిక పరిస్థితి దాపురించింది. ఐదారు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
అయితే అన్ లాక్ 4.0 పేరుతో సినీపరిశ్రమలకు రిలాక్సేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇక థియేటర్లు మల్టీప్లెక్సులు తెరుచుకోవడమే పెండింగ్. ఇక శుభలేఖలు ఇచ్చేశాం తన్నుకు చావండి! అన్న చందంగా వీటికి కూడా కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడానికి ఇంకెంతో సమయం పట్టదనే అర్థమవుతోంది.
అక్టోబర్ 15 నుండి థియేటర్లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతి ఇస్తుందని గట్టిగానే వినిపిస్తోంది. అనుమతులు మంజూరు చేసిన వెంటనే మల్టీ ప్లెక్స్ లు తిరిగి తెరుస్తారు. హాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలు తొలిగా ప్రదర్శిస్తారు. టాలీవుడ్ ఎగ్జిబిటర్లు దసరా నుండి థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రణాళికలు సిద్ధం చేసే ఆలోచనతో ఉన్నారట. థియేటర్లు నిండుతున్నాయా లేదా? అన్నది ఒకసారి చెక్ చేస్తారట.
ఒకసారి థియేటర్లు తెరిచేందుకు అధికారిక ప్రకటన వచ్చేస్తే.. దీపావళి.. దసరా బరిలో వరుసగా సినిమాల్ని రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తారట. అయితే క్రిస్మస్ వరకూ హిందీ- ఇంగ్లీష్ చిత్రాలతో పాటు పలు తెలుగు సినిమాల్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక వకీల్ సాబ్.. ఉప్పెన.. రెడ్ వంటివి సంక్రాంతి వరకూ రావని తెలుస్తోంది. అయితే చాలా చిన్న మిడ్ రేంజ్ సినిమాలు రిలీజయ్యేందుకు ఆస్కారం ఉందట. ఇక అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు లాంటి వారి విశ్లేషణ ప్రకారం.. థియేటర్లు తెరవకపోవడమే మంచిదా లేక తెరిస్తే గ్రాండ్ సక్సెస్ అవుతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కనీసం దసరా కాకపోయినా సంక్రాంతికి అయినా వ్యాక్సిన్ వచ్చేస్తుందనే హోప్ అయితే అందరిలో ఉంది. అందాకా కాస్త ఆగాలి మరి అన్న ఆలోచనా ధోరణి జనాలకు ఉంటే దసరా క్రిస్మస్ బరిలో సినిమాలు రిలీజైనా పెద్దగా ఉపయోగం ఉండచకపోవచ్చేమో!