గాడ్జిల్లా 2 కింగ్ అఫ్ మాన్స్ టర్స్ ఎలా ఉందట ?
రేపు తెలుగు సినిమాల సందడి ఉంది కాని ఇవాళ హాలీవుడ్ నుంచి వచ్చిన గాడ్జిలా 2 కింగ్ అఫ్ మాన్స్ టర్స్ థియేటర్లలో అడుగు పెట్టింది. 1998లో వచ్చిన బ్లాక్ బస్టర్ కు కొనసాగింపుగా 2014లో రెండో భాగం వచ్చింది కానీ ఆశించిన అంచనాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు వచ్చింది మూడో పార్ట్. వార్నర్ బ్రదర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ వేసవిలో పిల్లలను టార్గెట్ చేసుకుని వచ్చింది. చెప్పుకోవడానికి టైటిల్ ఘనంగా ఉంది కానీ సినిమా విషయం మాత్రం అంతంత మాత్రమే.
హాలీవుడ్ క్రిటిక్స్ సైతం దీని మీద 1 రేటింగ్ తో విరుచుకుపడ్డారు. కథలో కొత్తదనం లేకుండా అదే బ్యాక్ డ్రాప్ తో గాడ్జిల్లా రాకాసి బల్లుల మధ్య పోరాటాలు తప్ప ఇంకే ఎమోషన్ లేకుండా తీస్తున్న తీరు మీద ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. విజువల్ ఎఫెక్ట్స్ టాప్ స్టాండర్డ్ లో ఉండాల్సింది పోయి ఇరవై ఒక్క ఏళ్ళ క్రితం వచ్చిన ఒరిజినలే నయమనిపించేలా ఉందని మాములుగా ఆడుకోలేదు
వాటి సంగతేమో కానీ నిజంగానీ ఈ కింగ్ అఫ్ మాన్స్ టర్ ఇవన్నీ లోపించాయి. గ్రాఫిక్స్ విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం ఎగ్జైటింగ్ గా అనిపించే అమాశాలు ఎక్కువగా లేకపోవడం వెరసి రెండు గంటలకు పైగా ఉన్న ఈ మూవీ పెద్ద ప్రహసనంలా తోచింది. అదే కథను పదే పదే తీస్తూ ఈ మధ్య హాలీవుడ్ మనకన్నా మూసలోకి వెళ్తున్నారు.
అవెంజర్స్ లాంటి హై ఎండ్ విజువల్స్ చూసిన కళ్ళతో ఇలాంటి రోత కొట్టుడు మసాలాలు చూడటం కష్టమే. పైగా ఇది రెండేళ్ల క్రితమే పూర్తయిన సినిమా. సాగదీసి ఇప్పటికి విడుదల చేశారు. అంచనాల విషయంలో కనీస స్థాయిని అందుకోలేకపోయిన గాడ్జిల్లా కింగ్ అఫ్ మాన్స్ టర్స్ రేపు వచ్చే తెలుగు సినిమాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించనట్టే