• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అర్జున ఫల్గుణ' నుంచి...

'అర్జున ఫల్గుణ' నుంచి అలరిస్తోన్న 'గోదారి వాళ్ళే' పాట..!

By - Tupaki Desk
Update: 2021-11-13 14:50 GMT
వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు - అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా 'జోహార్' ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''అర్జున ఫల్గుణ''. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా 'గోదారి వాళ్ళే సందమామా' అనే పాట లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.

'పచ్చాని ఊళ్లే సందమామా.. యాడసూడు వీళ్లే సందమామా..' అంటూ సాగిన ఈ మెలోడీ పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. 'ఆసికాలు ఆడే అల్లరోళ్ళు.. భేషజాలు లేని బుజ్జిగాళ్ళు గోదారోళ్ళు' అంటూ గోదావరి జిల్లాల్లోని ప్రజల మనస్తత్వాలను తెలియజేసేలా లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ ఈ గీతానికి సాహిత్యం రాశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఈ పాటను చిత్రీకరించారు.

ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ స్వరపరిచిన 'గోదారి వాళ్ళే సందమామా' పాటను అమల చేబోలు - అరవింద్ మురళి కలిసి ఆలపించారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉంది. ఈ చిత్రానికి గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. విప్లవ్ నైషదం ఎడిటర్ గా వర్క్ చేశారు. ఫస్ట్ సింగిల్ గురించి హీరో శ్రీవిష్ణు ట్వీట్ చేస్తూ.. 'నేను గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగాను కాబట్టి, ఈ పాటలో భాగం కావడం వల్ల నా ఆనంద స్థాయి పారవశ్యానికి చేరుకుంది' అని పేర్కొన్నారు.

''అర్జున ఫల్గుణ'' చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీవిష్ణు పవర్ ఫుల్ రోల్‌ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే దర్శకుడు తేజ మార్ని అందించగా.. సుధీర్ వర్మ డైలాగ్స్ సమకూర్చారు. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Full View
Tags:    
  • ArjunaPhalguna 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS