గ్లోబల్ బ్యూటీ గ్లామరస్ ఫోటోషూట్స్ వైరల్.. పిచ్చెక్కిస్తోందిగా!

Update: 2021-01-26 06:30 GMT
బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి హాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ గ్లోబల్ హీరోయిన్ గా స్టార్డం సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా. ఈ భామ ఇండియన్ సినిమాలలో కనిపించి కొన్నేళ్లు గడిచింది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత న్యూయార్క్ నగరంలో సెటిల్ అయింది ప్రియాంక. నిజానికి అందరూ లాక్ డౌన్ లో హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఇంతకాలం ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని ఎంజాయ్ చేశారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోయిన్స్ మాత్రమే వారి కెరీర్ పై దృష్టిపెట్టారు. అలాంటి వారిలో ప్రియాంక ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. హాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత ప్రియాంక పూర్తిగా ఖాళీ లేకుండా బిజీ అయిపోయింది. ఎల్లప్పుడూ ఏదొక ఫోటోషూట్ లేదా షూటింగ్ అంటూ తన లైఫ్ లో నుండి ఖాళీ సమయం అనే పదానికి ఛాన్స్ ఇవ్వడం లేదట. అయితే ఆ మధ్య లాక్ డౌన్ లో పియనో కూడా నేర్చుకుంది అమ్మడు. ఇక భారీ గ్యాప్ తర్వాత ఇండియన్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ తో ప్రియాంక 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' అనే హాలీవుడ్ మూవీలో నటించింది.

ప్రస్తుతం ప్రియాంక చేతిలో అన్ని హాలీవుడ్ వెబ్ సిరీస్ లు, సినిమాలే ఉన్నాయట. అసలు ఇండియాలో పుట్టిపెరిగిన ప్రియాంక.. ఇప్పుడు ఇండియాకి రావడానికి టైం దొరకట్లేదని అంటుందట. పెళ్లికి ముందు సినిమాలలో కెమెరా ముందు ఎలా చెలరేగిందో.. పెళ్లి తర్వాత కూడా అంతే జోరు కొనసాగిస్తుంది. అందుకే పబ్లిక్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా తన భర్తతో రొమాన్స్ మాత్రం ఆపట్లేదు. రెగ్యులర్ గా వార్తలలో నిలవడం ప్రియాంకకు మాములే అయిపోయింది. అయితే ఫోటోషూట్స్ తో మాత్రం అందాలను గుప్పించడం డోస్ తగ్గించలేదు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రియాంక లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేసింది. అందులో అమ్మడి గ్లామర్ చూస్తూ ఫిదా అవుతున్నారు ఫాలోయర్స్. ప్రియాంకకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. అందుకే సోషల్ మీడియా ద్వారా పలు బ్రాండ్స్ ను పబ్లిసిటీ చేస్తోంది. తాజాగా వెరైటీ దుస్తులలో దర్శనమిచ్చిన ఈ భామ సోకుల వడ్డన మాత్రం అలాగే మెయింటైన్ చేసింది. ఓ వైపు ఫోటోకి లుక్కిస్తూనే మరోవైపు ఎద సంపదను ఎరగా వేసి పిచ్చెక్కిస్తోంది అమ్మడు. ప్రస్తుతం ప్రియాంక గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News