సెన్సార్ బోర్డ్ కి మరోసారి ఎదురుదెబ్బ

Update: 2017-04-26 06:21 GMT
సెన్సార్ బోర్డ్ నిర్ణయాలు ఎంత చిత్ర విచిత్రంగా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సీబీఎఫ్సీ ఛైర్మన్ గా పహ్లజ్ నిహలానీ బాధ్యతలు చేపట్టాక.. ఈ వివాదాల స్థాయి మరింతగా పెరిగిపోయింది. భారీగా కట్స్ చెప్పడం.. అసలు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించడం వంటివి జరుగుతున్నాయి.

గతేడాది ఉడ్తా పంజాబ్ విషయంలో జరిగిన హంగామా చూశాం. ఇప్పుడు 'లిప్ స్టిక్ అండర్ మై బురఖా' మూవీ విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఈ మూవీకి అభ్యంతరకరమైన సన్నివేశాలు.. అసభ్యమైన దృశ్యాలు.. వినలేని స్థాయిలో సంభాషణలు ఉన్నాయంటూ.. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సీబీఎఫ్సీ నిరాకరించింది. దీంతో ఈ మూవీ మేకర్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. చివరకు.. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ.. ట్రైబ్యునల్ ఆదేశించింది. అదే సమయంలో.. చిత్రం నుంచి శృతి మించి ఉన్న కొన్ని సన్నివేశాలను.. మాటలను స్వచ్ఛందంగా తొలగించాలని మేకర్స్ కూడా సూచించింది అప్పిలేట్ ట్రైబ్యునల్. ఈ ఆదేశంతో సీబీఎఫ్సీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

కొంకణా సేన్.. రత్నా పాఠక్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని అలంకిత శ్రీవాస్తవ దర్శకత్వంలో ప్రకాష్ ఝా నిర్మించారు. మహిళా ప్రాధాన్యత ఉన్న తమ చిత్రం.. వారి కలలకు ప్రతిరూపం అన్న కొంకణా సేన్.. లిప్ స్టిక్ అండర్ మై బురఖా మూవీకి సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News