ప్రశాంత్ నీల్… మరో జెట్ స్పీడ్ ప్లాన్

పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నిల్ గత ఏడాది సలార్ మూవీతో ప్రభాస్ కి హిట్ ఇచ్చారు.

Update: 2024-05-07 04:04 GMT

పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నిల్ గత ఏడాది సలార్ మూవీతో ప్రభాస్ కి హిట్ ఇచ్చారు. ఈ సినిమాకి 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని ఆశించారు. అయితే సరైన ప్రమోషన్ లేకపోవడం, అదే సమయంలో షారుక్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ కావడం, సినిమా కూడా అంచనాలు అందుకోలేకపోవడంతో 700 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తే అందులో హైయెస్ట్ కలెక్షన్స్ సలార్ మూవీకి వచ్చాయి. సలార్ కి సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ శౌర్యంగ పర్వం సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సలార్ క్లైమాక్స్ లో విడిచిపెట్టిన చాలా ప్రశ్నలకు ఈ సీక్వెల్ లో సమాధానం చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో శౌర్యంగ పర్వం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ప్రశాంత్ నీల్ చాలా తక్కువ సమయం తీసుకోనున్నారంట. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తోంది. మే నెల ఆఖరిలో సలార్ 2 షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో నవంబర్ ఎండ్ కి ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా ఖాన్సార్ అనే ఫిక్షనల్ సిటీ సెట్ ని వేశారు. సలార్ సీక్వెల్ కి సంబందించిన మెజారిటీ షూటింగ్ ఈ సెట్ లోనే జరగబోతోంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో నవంబర్ నాటికి మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారంట. ప్రభాస్ కూడా వీలైనంత వేగంగా సలార్ 2 కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు.

Read more!

కల్కి మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం డార్లింగ్ రాజాసాబ్ సెట్స్ లో ఉన్నారు. ఇది కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ నెల ఆఖరు నుంచి సలార్ కి ప్రభాస్ కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సలార్ కంప్లీట్ చేసి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని ప్రభాస్ అనుకుంటున్నారు.

దీంతో ప్రశాంత్ నీల్ ఆరు నెలల్లో సలార్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని షెడ్యూల్ వేసుకున్నారంట. ఈ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ లో రూపొందనున్న ఆ సినిమా కూడా రెండు భాగాలుగా రానుంది. అలాగే సలార్ 2 మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News